Rohit Sharma CWC Centuries Record : 2023 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు.. తమకు తిరుగులేదన్నట్లుగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆడిన ఏడు మ్యాచ్‌లను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా సెమీస్ రేసులో అడుగు పెట్టిన తొలి జట్టుగా రికార్డుకెక్కింది. ఇక టీమ్ఇండియాలోని బ్యాటర్లు, బౌలర్లు ఒకరిని మించి ఒకరు ప్రత్యర్థి జట్లపై విజృంభిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంకలతో తలపడిన మ్యాచ్‌ల్లో తప్ప మిగిలిన అన్నింటిలోనూ అద్భుతంగా ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్‌కు అదిరిపోయే శుభారంభాలు అందించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ హిట్‌మ్యాన్‌కు సంబంధించి ఓ ప్రపంచకప్ వన్డే రికార్డ్ డేంజర్ జోన్లో పడనుంది. అదేంటంటే..
కొడితే రెండు.. లేదంటే ఒక్కటి!
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ వన్డే టోర్నీకి సంబంధించి ఓ రికార్డుపై కన్నేశాడు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్. అదే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు. 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఏకంగా 5 సెంచరీలతో విరుచుకపడ్డాడు. దీంతో ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా రికార్డులోకెక్కాడు. అయితే ప్రస్తుతం ఈ రికార్డును బద్దలు కొట్టే పనిలో పడ్డాడు డీకాక్.
-
One more step in the right direction ✅ pic.twitter.com/bIz0ecFAEV
— Rohit Sharma (@ImRo45) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">One more step in the right direction ✅ pic.twitter.com/bIz0ecFAEV
— Rohit Sharma (@ImRo45) November 2, 2023One more step in the right direction ✅ pic.twitter.com/bIz0ecFAEV
— Rohit Sharma (@ImRo45) November 2, 2023
ప్రస్తుతం జరుగుతున్న మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన డీకాక్.. ఏకంగా 4 శతకాలు కొట్టాడు. రోహిత్ శర్మ నిర్దేశించిన రికార్డుకు ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. డీకాక్ కూడా ప్రస్తుతం మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కాగా, ఈ స్టార్ బ్యాటర్ కనిష్ఠంగా ఇంకా 2 మ్యాచులు, ఒకవేళ ఫైనల్స్‌కు చేరితే గరిష్ఠంగా 4 మ్యాచులు ఆడే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌ల్లో గనుక అతడు రెండు సెంచరీలు బాదితే మాత్రం రోహిత్ పేరిట ఉన్న ప్రపంచకప్ సెంచరీల(5 శతకాలు) రికార్డును బద్దలు కొట్టడం ఖాయం. ఒక్క సెంచరీ చేసినా సమంగా రోహిత్ సరసన నిలవటం పక్కా.
కింగ్ బర్త్‌డే రోజే 'సఫారీలతో సై'..
మరోవైపు భారత్ తన తదుపరి మ్యాచ్‌ను నవంబర్ 5న(ఆదివారం) కోల్‌కతా వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో దూకుడు మీదున్న ప్రత్యర్థి జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే సఫారీలతో భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే. అయితే అదేరోజు కింగ్ విరాట్ పుట్టినరోజు కూడా కావడం విశేషం.
వరుస విజయాలతో భారత్ కొత్త రికార్డు - అప్పుడు 8, ఇప్పుడు 7!
'భారత బౌలర్లకు స్పెషల్ బాల్స్ ఇస్తున్నారు- అందుకే వాళ్లు అలా!'