Rohith sharma IND VS WI second T20: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ భువనేశ్వర్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. అతడు బాగా ఆడాడని కితాబిచ్చాడు.
"వెస్టిండీస్‌తో ఆడాలంటే ఎప్పుడూ భయమేస్తుంది. వాళ్లతో పోటీ అంటే కష్టంగా ఉంటుందని తెలుసు. అందుకు తగ్గట్టుగానే మేం సన్నద్ధమై బరిలోకి దిగాం. ఒత్తిడిలోనూ మా ప్రణాళికలన్నీ అమలు చేసినందుకు సంతోషంగా ఉంది. ఇక భువనేశ్వర్ బౌలింగ్ చేసిన 19వ ఓవర్ చాలా కీలకమైనది. అక్కడ అనుభవమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఎన్నో ఏళ్లుగా అతడు అదే పని చేస్తున్నాడు. అతడి టాలెంట్‌పై మాకు నమ్మకం ఉంది"
-రోహిత్ శర్మ
అనంతరం కోహ్లీ గురించి మాట్లాడుతూ.. "కోహ్లీ ఆటను ఆరంభించిన తీరు చూస్తే నాపైన ఒత్తిడినంతా తీసేసాడు. ఇది చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్. రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్లు అద్భుతంగా ఆటను ముగించారు. అయ్యర్ ఎంతో విశ్వాసంతో ఆడాడు. చివర్లో అవసరం ఉంటే బౌలింగ్ చేస్తానని చెప్పాడు. ఫీల్డింగ్‌లో కొంచెం నిరాశపరిచాం. ఆ క్యాచ్‌లు పడితే బాగుండేది. ఈ తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్తాం." అని రోహిత్ అన్నాడు.
మ్యాచ్ ఫలితం పక్కన పెడితే విండీస్ బ్యాటర్లు బాగా ఆడారని రోహిత్ శర్మ చెప్పాడు. పూరన్, పొవెల్లు మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకూ తీసుకువచ్చారని అన్నాడు రోహిత్. మెుదటి మ్యాచ్ మిడిల్ ఓవర్స్‌లో తాము నెమ్మదిగా ఆడామని దానిని ఇప్పుడు సరిచేసుకున్నామని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: IND VS WI: మూడో టీ20కు కోహ్లీ దూరం