టీమ్ఇండియా నూతన వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించింది బీసీసీఐ. ఈ మేరకు ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు బీసీసీఐ బుధవారం వెల్లడించింది. ఇటీవలే విరాట్ కోహ్లీ నుంచి టీ20లు పగ్గాలు అందుకున్న రోహిత్‌ను.. వన్డేలకూ సారథిగా నియమిస్తున్నట్లు తెలిపింది.
ఇక డిసెంబర్ 26న ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం.. టెస్టు జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. అజింక్య రహానె స్థానంలో రోహిత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
ఇదీ జట్టు(టెస్టు)..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వస్ వాలాను స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు.
కెప్టెన్‌గా కోహ్లీ..
95 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. 65 విజయాలను అందించాడు. 27 మ్యాచుల్లో ఓడిపోగా, ఒకటి టై అయ్యింది.