Rohit Kohli T20 World Cup: 2024 టీ20 వరల్డ్‌కప్ షెడ్యుల్ రిలీజైన తర్వాత ఈ టోర్నమెంట్ గురించి క్రీడావర్గాల్లో చర్చ ఎక్కువైంది. ముఖ్యంగా భారత్ జట్టుకు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు? స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ టోర్నీకి ఎంపికవుతారా? అన్న ప్రశ్నలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ, ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అయితే టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
రానున్న టీ20 వరల్డ్‌కప్ భారత జట్టులో రోహిత్, విరాట్ ఉండాల్సిందేనని గంగూలీ అన్నాడు. '2024 టీ20 ప్రపంచకప్ టీమ్ఇండియాకు రోహిత్ శర్మే కెప్టెన్‌గా ఉండాలి. బీసీసీఐ కూడా 2007 ప్రపంచకప్‌లా యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును రోహిత్‌కు ఇవ్వాలి. విరాట్ కూడా జట్టులో ఉండాల్సిందే. విరాట్ అత్యుత్తమ ప్లేయర్. వీరిద్దరూ 14 నెలల తర్వాత కూడా టీ20ల్లో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వగలరు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరిస్‌లో యశస్వీ జైశ్వాల్ ఆకట్టుకున్నాడు. అతడి కెరీర్లో ఇది ప్రారంభం మాత్రమే. ఫ్యుచర్లో జైశ్వాల్‌కు అవకాశాలు పుష్కలంగా వస్తాయి. ఈ పర్యటనలో టీమ్ఇండియా అద్భతంగా ఆడింది. వన్డే సిరీస్‌ను గెలుచుకొని, టీ20, టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఈ ఫలితాలే టీమ్ఇండియా బలమైన జట్టు అనేదానికి నిదర్శనం' అని గంగూలీ అన్నాడు.
-
Ganguly said "Virat Kohli is an outstanding player - he should be part of the T20I for India". [RevSportz] pic.twitter.com/RUSSPqI7X6
— Johns. (@CricCrazyJohns) January 7, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ganguly said "Virat Kohli is an outstanding player - he should be part of the T20I for India". [RevSportz] pic.twitter.com/RUSSPqI7X6
— Johns. (@CricCrazyJohns) January 7, 2024Ganguly said "Virat Kohli is an outstanding player - he should be part of the T20I for India". [RevSportz] pic.twitter.com/RUSSPqI7X6
— Johns. (@CricCrazyJohns) January 7, 2024
ICC T20 2024 Schedule: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల 2024 టీ20 వరల్డ్‌కప్ షెడ్యుల్ విడుదల చేసింది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక ఈ టోర్నమెంట్ 2024 జూన్ 1న యూఎస్ఏ వర్సెస్ కెనడ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఆమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికలుగా 29 రోజుల పాటు ఈ టోర్నీ సాగనుంది. మొత్తం రెండు సెమీస్, ఫైనల్ సహా టోర్నీలో 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్- పాకిస్థాన్ జూన్ 9న తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌కు న్యూయార్క్ వేదిక కానుంది. కాగా, జూన్ 29న బర్బాడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 2024 టీ20 పూర్తి షెడ్యుల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టీ20 వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ ఇన్, కోహ్లీ ఔట్- కెప్టెన్ ఛాన్స్ అతడికే!
పొట్టి వరల్డ్ కప్- భారత్ X పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే?