ETV Bharat / sports

వన్డే కెప్టెన్సీపై కోహ్లీ, రోహిత్​తో సెలెక్టర్ల మంతనాలు!

Rohit Kohli ODI Captaincy: రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీ అప్పగించే విషయమై బోర్డు ఆలోచిస్తోందని తెలిపారు ఓ బీసీసీఐ అధికారి. ఈ నిర్ణయం తీసుకునే ముందు కోహ్లీతో పాటు రోహిత్​తో చర్చలు జరిపాలని టీమ్ఇండియా సెలెక్టర్లు భావిస్తున్నట్లు వెల్లడించారు.

Virat Kohli ODI captaincy, Rohit Sharma ODI captaincy, రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ, కోహ్లీ వన్డే కెప్టెన్సీ
Virat Kohli
author img

By

Published : Dec 8, 2021, 12:46 PM IST

Rohit Kohli ODI Captaincy: టీ20 ప్రపంచకప్ ముగిశాక ఈ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. ఈ బాధ్యతల్ని రోహిత్ శర్మకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే వన్డే కెప్టెన్నీని కూడా హిట్​మ్యాన్​కు ఇవ్వాలని బోర్డుతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ బ్యాటింగ్​లో సరిగ్గా రాణించలేకోపోతుండటం, తన ఫామ్​పై తిరిగి దృష్టిసారించడం కోసం అతడిని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్​లోనే రోహిత్​కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని వారు చూస్తున్నట్లు సమాచారం. తాజాగా దీనిపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. ఈ విషయంపై కోహ్లీ, రోహిత్​తో మాట్లాడి స్పష్టతకు వస్తామని వెల్లడించారు.

"వన్డే కెప్టెన్సీ అనేది సున్నితమైన అంశం. ప్రస్తుతం టీ20 కెప్టెన్​గా ఉన్న రోహిత్ శర్మకు వన్డే సారథ్యం కూడా అప్పజెప్పాలనే ఆలోచన ఉంది. ఇందుకోసం కోహ్లీతో సెలెక్టర్లు చర్చించాలని భావిస్తున్నారు. అలాగే ఈ విషయంలో రోహిత్ కూడా క్లారిటీ కావాలని భావిస్తున్నందువల్ల.. అతడితోనూ సెలెక్షన్ కమిటీ చర్చలు జరుపుతుంది."

-బీసీసీఐ అధికారి

IND vs SA Series: దక్షిణాఫ్రికా పర్యటన డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది. ఇరుజట్ల మధ్య ముందుగా మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందుకోసం బుధవారం జట్టును ప్రకటించనుంది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. కొద్దిరోజుల తర్వాత వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించనున్నారు.

ఇవీ చూడండి: టెస్టుల్లో తొలి బంతికే వికెట్.. ఆసీస్ పేసర్ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.