టీమ్ఇండియా టీ20 సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు (KL Rahul News) వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఈ కొత్త నాయకత్వ బృందం.. మంచి జట్టు సంస్కృతిని నెలకొల్పుతుందని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌తో భారత క్రికెట్లో కొత్త శకం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ (KL Rahul Dravid), రోహిత్ గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు రాహుల్.
"రాహుల్ ద్రవిడ్.. చాలాకాలంగా తెలియడం నా అదృష్టం. ఆయన ఆడే విధానం చూసి.. ఆటను మరింతగా అర్థం చేసుకున్నాను. ద్రవిడ్‌ది ఎంత పెద్ద పేరో.. దేశం కోసం అతడు ఏం చేశాడో అందరికీ తెలుసు. కోచ్‌గా.. జట్టులో మంచి సంస్కృతిని నెలకొల్పుతాడు. వ్యక్తులను ఉన్నతంగా, క్రికెటర్లను గొప్పగా తీర్చిదిద్దుతాడు. ఆయన జట్టు కోసమే ఆడాడు. ఇప్పుడూ జట్టులో అదే సంస్కృతిని తెస్తాడు."
- కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్
కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ.. వ్యూహాత్మక మేధావి అని (KL Rahul Rohit Sharma) అన్నాడు రాహుల్. "రోహిత్ గురించి.. ఐపీఎల్, రికార్డులే మాట్లాడుతాయి. ఆట గురించి గొప్ప అవగాహన, నేర్పు అతడి సొంతం. డ్రెస్సింగ్‌రూమ్‌లోకి చాలా ప్రశాంతతను తీసుకొస్తాడు." అని రాహుల్ చెప్పాడు.
![kl rahul dravid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13644146_1.jpg)
'ద్రవిడ్, రోహిత్ కాంబోలో ప్రపంచకప్'
టీ20 ప్రపంచకప్(t20 2world cup 2021)లో టీమ్ఇండియా సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో భారత జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ టోర్నీలో విజయం సాధించలేదు భారత్. కెప్టెన్‌గా కోహ్లీ, కోచ్‌గా రవిశాస్త్రి కాంబినేషన్లో ఒక్క మెగాటోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(gautam gambhir on virat captaincy).. రోహిత్ కెప్టెన్సీ, రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా భారత్ కచ్చితంగా వచ్చే ప్రపంచకప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"కెప్టెన్‌గా రోహిత్(gambhir on rohit sharma), కోచ్‌గా ద్రవిడ్ ఈ ఫార్మాట్లో జట్టును మరింత ముందుకు తీసుకువెళతారని అనుకుంటున్నా. అలాగే ప్రపంచకప్ టైటిల్ కూడా వీరు సాధిస్తారని నమ్ముతున్నానని" వెల్లడించాడు గంభీర్.
ఈ ప్రపంచకప్(t20 2world cup 2021)లో భాగంగా సోమవారం (నవంబర్ 8) నమీబియాతో జరిగే మ్యాచ్ ఇటు కోచ్‌గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్‌గా కోహ్లీకి చివరిది. దీంతో ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి వీరిద్దరికి గొప్ప వీడ్కోలు పలకాలని యాజమాన్యం భావిస్తోంది.
ఇవీ చూడండి:
ఐసీసీ జట్టులో టీమ్ఇండియా క్రికెటర్లకు దక్కని చోటు