ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు శుభవార్త. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కొవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. డర్హమ్‌లో ఉన్న జట్టు బయో బబుల్‌తో అతడు మంగళవారం కలవనున్నట్లు సమాచారం.
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత దాదాపు 3 వారాలు టీమ్ఇండియాకు విశ్రాంతి లభించింది. ఇక లండన్‌లో తిరిగిన పంత్‌కు జులై 8న కరోనా అంటుకుంది. దీంతో అక్కడ ఉన్న తన స్నేహితుడి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు పంత్. పది రోజుల క్వారంటైన్ అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించగా వైరస్ లేదని తేలింది.
జులై 20న సెలెక్ట్ కౌంటీ ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది కోహ్లీ సేన. ఈ మ్యాచ్‌కు పంత్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. రెండో వార్మప్ మ్యాచ్‌లో అతడు పాల్గొంటాడని సమాచారం.
పంత్‌తో పాటు సహాయక సిబ్బంది దయానందకు కూడా కొవిడ్ నిర్ధరణ అయింది. దయానందతో సీనియర్ వికెట్ కీపర్ సాహా సన్నిహితంగా ఉండడం వల్ల అతడు కూడా నిర్బంధంలోకి వెళ్లాడు. దీంతో మొదటి వార్మప్ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
కౌంటీలకు అయ్యర్ దూరం..
టీమ్ఇండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. జులై 22 నుంచి జరిగే రాయల్ లండన్ కప్ 2021లో పాల్గొనబోనని వెల్లడించాడు. ఈ విషయాన్ని లంకాషైర్ జట్టు తమ అధికారిక ట్విట్టర్లో ప్రకటించింది.
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు అయ్యర్. దీంతో ఐపీఎల్ మొదటి దశ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నప్పటికీ కౌంటీల్లో ఆడట్లేదని స్పష్టం చేశాడు. భవిష్యత్తులో కచ్చితంగా లంకాషైర్ తరఫున ఆడతానని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ప్రపంచకప్ సూపర్ లీగ్‌లో టీమ్ఇండియా స్థానం ఇదే..