ETV Bharat / sports

దిల్లీ పగ్గాలు పంత్​కే.. శ్రేయస్​పై ఒత్తిడి ఉండొద్దనే! - శ్రేయస్ అయ్యర్​కు మరింత విశ్రాంతి

గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మొదటి దశకు దూరమయ్యాడు దిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్. దీంతో ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రిషభ్ పంత్​కు అప్పగించింది యాజమాన్యం. తాజాగా కోలుకున్న శ్రేయస్.. లీగ్ రెండో దశ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. దీంతో కెప్టెన్​గా ఎవరిని నియమించాలన్న సందిగ్ధంలో పడిందట ఫ్రాంచైజీ. అయితే పంత్​కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంబంధింత వర్గాలు తెలిపాయని తెలుస్తోంది.

Rishabh Pan
పంత్​
author img

By

Published : Aug 30, 2021, 8:06 PM IST

ఐపీఎల్‌ రెండో దశలో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషభ్ పంతే ఉండనున్నాడు! గాయం నుంచి కోలుకొని వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌పై మరీ ఒత్తిడి పెట్టొద్దని దిల్లీ యాజమాన్యం భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం శ్రేయస్‌ దుబాయ్‌లోనే ఉన్నాడు.

ఐపీఎల్‌కు ముందు టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీసులు ఆడింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడుతుండగా ఫీల్డింగ్‌ చేస్తూ శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడ్డాడు. అతడి భుజం ఎముక పక్కకు తొలగడం వల్ల శస్త్రచికిత్స అవసరమైంది. ఫలితంగా ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. బయో బుడగలోకి కరోనా వైరస్‌ ప్రవేశించిన కారణంగా లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ లోపు కోలుకున్న శ్రేయస్‌ రెండో దశకు సిద్ధమయ్యాడు. అతడి రాకతో ఫ్రాంచైజీకి మరో తలనొప్పి ఎదురైంది.

ఎందుకంటే గత సీజన్లలో శ్రేయస్‌ జట్టును నడిపించాడు. అతడు లేకపోవడం వల్ల బాధ్యతలు రిషభ్ పంత్‌కు అప్పగించారు. అతడు నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. వరుస విజయాలు అందించాడు. ఇప్పుడు శ్రేయస్‌ రావడం వల్ల ఎవరిని కెప్టెన్‌ చేస్తారోనన్న సందేహాలు కలుగుతున్నాయి. కాగా శ్రేయస్‌పై మరీ ఎక్కువ భారం మోపకూడదని ఫ్రాంచైజీ భావిస్తోందట.

"నిజానికి శ్రేయస్‌ అయ్యర్‌ కోలుకొని తిరిగిరావడం గొప్ప శుభవార్త. అతడు క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఐతే అతడు కోలుకోవడానికి మరింత సమయం ఇవ్వాలని డీసీ యాజమాన్యం భావిస్తోంది. అంటే ఐపీఎల్‌ రెండో దశకు రిషభ్ పంత్‌ సారథ్యం వహిస్తాడు" అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవీ చూడండి: 'కోహ్లీ పరుగులు చేయాలంటే ఇలా ఆడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.