ETV Bharat / sports

ఆ విషయంలో కెప్టెన్ కోహ్లీకి అండగా పంత్ - ఇండియా vs ఇంగ్లాండ్

మూడో టెస్టు గురించి మాట్లాడిన భారత యువ క్రికెటర్ పంత్.. అంచనాలు తప్పడం వల్ల బ్యాటింగ్​లో విఫలమయ్యామని అన్నాడు. రెండో ఇన్నింగ్స్​లో భారీ స్కోరు చేస్తామని చెప్పాడు.

Rishabh Pant Backs Captain Virat Kohli
పంత్
author img

By

Published : Aug 26, 2021, 12:17 PM IST

ఇంగ్లాండ్​తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 78 పరుగులకే ఆలౌటైంది. మన బ్యాట్స్​మెన్ చేతులెత్తేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. టాస్ గెలిచిన కోహ్లీ.. బ్యాటింగ్​ తీసుకోవడంపై, ఒకవేళ తీసుకున్నా సరే విఫలం కావడంపై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే విరాట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అతడికి అండగా నిలిచాడు వికెట్ కీపర్ పంత్. తమ బ్యాటింగ్​ లోపాలు, ప్రత్యర్థి బౌలర్లు పిచ్​ను సద్వినియోగం చేసుకోవడం వల్లే ఆలౌట్​ అయ్యామని అన్నాడు.

kohli
కోహ్లీ

అలానే సిరాజ్​పై ఇంగ్లీష్ జట్టు అభిమానులు బాటిల్​ విసిరానని పంత్ వెల్లడించాడు. అయితే తనను ఎగతాళి చేస్తూ, అరుస్తున్న వాళ్లకు అదే రీతిలో సమాధానమిస్తూ కనిపించాడు సిరాజ్. ఆ వీడియో కూడా ఇప్పటికే వైరల్​గా మారింది.

siraj pant
సిరాజ్

క్రీజులో తన స్టాన్స్​ కూడా మార్చుకున్నానని పంత్ చెప్పాడు. అంపైర్​ చెప్పడం వల్ల ఈ మార్పు జరిగిందని పేర్కొన్నాడు. క్రీజు బయట నిలబడం వల్ల డేంజర్ ఏరియాలో తన పాదముద్రలు పడుతున్నాయని, అందువల్లే నిల్చునే ప్రదేశం మారిందని అన్నాడు.

తొలి ఇన్నింగ్స్​లో తమ బ్యాట్స్​మెన్ అంచనాలు తప్పాయని చెప్పిన పంత్.. తర్వాత ఇన్నింగ్స్​లో వాటిలో సరిచేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ప్రతిసారి అందరూ సక్సెస్​ కాలేరని, కొన్నిసార్లు వైఫల్యాలు వెంటాడతాయని అన్నాడు.

ఈ మ్యాచ్​లో రెండే పరుగులు చేసిన పంత్.. రాబిన్​సన్ బౌలింగ్​లో ఔటయ్యాడు. తొలిరోజు ఆట ముగిసేటప్పటికి ఇంగ్లాండ్ 120/0 స్కోరుతో ఉంది. మరో నాలుగు రోజుల ఆట ఉన్న నేపథ్యంలో టీమ్​ఇండియా ఏం చేస్తుందో చూడాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.