ETV Bharat / sports

ధోనీ రికార్డు బ్రేక్ చేసిన పంత్- కోహ్లీ మళ్లీ.. - అజింక్య రహానె

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టులో ఆడుతున్న పంత్.. అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్​లో అత్యంత వేగంగా 1500 పరుగులు చేసిన భారత వికెట్​ కీపర్​గా రికార్డు సృష్టించాడు.

Rishabh Pant
రిషబ్ పంత్
author img

By

Published : Sep 5, 2021, 7:01 PM IST

టీమ్​ఇండియా వికెట్​కీపర్ రిషబ్ పంత్.. టెస్టుల్లో 1500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత వికెట్​ కీపర్​గా ఘనత సాధించాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు పంత్. 42 ఇన్నింగ్స్​ల్లో పంత్ ఈ మార్క్​ను అందుకోగా.. ధోనీ 50 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు.

కోహ్లీ మరోసారి

టెస్టుల్లో మొయిన్ అలీ బౌలింగ్​లో ఆరోసారి ఔట్ అయ్యాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇప్పటి వరకు నాథన్ లైయన్, జేమ్స్​ అండర్సన్ బౌలింగ్​లో ఏడు సార్లు పెవిలియన్ చేరిన విరాట్​.. ఆ తర్వాత మొయిన్​ అలీ బౌలింగ్​లోనే ఎక్కువ సార్లు ఔట్ అయ్యాడు. ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 44 పరుగుల వద్ద అలీ బౌలింగ్​లో ఓవర్టన్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.

రహానె చెత్త రికార్డు

అంతకుముందు 8 బంతులాడి డకౌట్​ అయిన అజింక్య రహానె.. ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కేవలం ఇంగ్లాండ్​పైనే 9 సార్లు డకౌట్​ అయిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు. తన కెరీర్లో మిగిలిన అన్ని జట్లపై కలిపి కేవలం 8సార్లే డకౌట్​ అయ్యాడు. ఇక ది ఓవల్​లోనే డకౌట్​ అవడం ఇది మూడోసారి.

ఇదీ చూడండి: Ind vs Eng: కష్టాల్లో భారత్.. లంచ్​ విరామానికి 329/6

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.