ETV Bharat / sports

సెమీ ఫైనల్స్ అంపైర్లు ఫిక్స్ - టీమ్ఇండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ! ఎందుకో తెలుసా?

2023 World Cup Semis Umpires : 2023 వరల్డ్​కప్​ సెమీస్ ఫైనల్స్​ మ్యాచ్​ అంపైర్లు, రిఫరీలను ఐసీసీ వెల్లడించింది. భారత్ ఆడే తొలి మ్యాచ్​లో ఆ అంపైర్ లేకపోవడం నెట్టింట చర్చనీయాంశమైంది.

richard kettleborough vs india
richard kettleborough vs india
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 8:14 PM IST

Updated : Nov 13, 2023, 8:21 PM IST

2023 World Cup Semis Umpires : 2023 వరల్డ్​కప్​లో అసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. 10 జట్లు పోటీపడిన ఈ టోర్నీలో.. చివరికి 4 జట్లు టైటిల్ రేస్​లో నిలిచాయి. ఈ క్రమంలో నవంబర్ 15, 16న రెండు సెమీఫైనల్​ మ్యాచ్​లు జరగనున్నాయి. సెమీస్​లో నెగ్గిన రెండు జట్లు ఫైనల్​ పోరు అర్హత సాధిస్తాయి. అయితే ఈ రెండు సెమీస్​కు సంబంధించి మ్యాచ్ రిఫరీలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

సెమీఫైనల్ - 1.. తొలి సెమీస్​లో భారత్ - న్యూజిలాండ్ పోటీపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మకమైన పోరుకు ముంబయి వాంఖడే స్టేడియం వేదికకానుంది. ఇక ఈ మ్యాచ్​కు రిచర్డ్ ఇల్లింగ్​వర్త్ - రాడ్ టక్కర్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. జోయెల్ విల్​సన్ థర్డ్ అంపైర్​ కాగా.. ఆడ్రియన్ హోల్డ్​స్టాక్ ఫోర్త్​ అంపైర్​. ఇక ఆండి పైక్రాఫ్ట్​ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు.

సెమీఫైనల్ - 2.. రెండో సెమీస్​లో ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్​ కోల్​కతా ఈడెన్ గార్డెన్స్​ వేదికకా జరగనుంది. ఈ మ్యాచ్​లో రిచర్డ్​ కెటిల్​ బోరొగ్ - నితిన్ మీనన్ ఫీల్డ్​ అంపైర్లు ఉండనున్నారు. క్రిస్ గఫ్పాని థర్డ్ అంపైర్​గా, మైఖెల్ గాఫ్ ఫోర్త్ అంపైర్​గా వ్యవహరించనున్నారు. ఇక మ్యాచ్​ రిఫరీగా జవగల్ శ్రీనాథ్ ఉండనున్నారు.

Richard Kettleborough vs India : ఫేమస్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్​ కెటిల్​ బోరొగ్.. తొలి సెమీస్​లో అంపైరింగ్ చేయడం లేదు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో 'భారత్​కు శుభసూచకం' అంటూ మీమ్స్​ క్రియేట్ చేస్తున్నారు. ఆనందం వ్యక్తం చేస్ సంతోషిస్తున్నారు. అయితే గత తొమ్మిదేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో.. టీమ్ఇండియా ఆడిన నాకౌట్​ మ్యాచ్​లన్నింటిలోనూ కెటిల్​ బోరొగ్ ఫీల్డ్ అంపైర్​గా ఉన్నారు. దురదృష్టవశాత్తు భారత్.. అన్నింట్లోనూ ఓడి ఇంటిబాట పట్టింది. అప్పట్లో ఈ మ్యాచ్​ ఫలితాల్లో అంపైర్ బోరొగ్ కూడా ఫేమస్ అయ్యారు. ఇక ప్రస్తుత సెమీస్​లో ఆయన లేకపోవడం టీమ్ఇండియాకు కలిసొస్తుందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ODI World Cup 2023 : పాకిస్థాన్ కొంపముంచిన 'అంపైర్స్ కాల్'!.. ఇప్పుడంతా దీని గురించే పెద్ద రచ్చ

తొలిసారిగా మహిళా అంపైర్ల అరంగేట్రం.. బీసీసీఐ అవకాశంతో..!

Last Updated : Nov 13, 2023, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.