ETV Bharat / sports

rohit captaincy: రోహిత్​కు వన్డే పగ్గాలు.. మాజీలు ఏమన్నారంటే?

rohit sharma captaincy news: టీమ్​ఇండియా వన్డే కెప్టెన్​గా రోహిత్​ శర్మను నియామకం మంచి నిర్ణయమని అన్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. అయితే టెస్టులకు విరాట్​ కోహ్లీనే సారథిగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు కెప్టెన్లతో ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుందని చెప్పాడు వ్యాఖ్యాత హర్షా భోగ్లే.

rohit sharma captaincy news
రోహిత్ శర్మ
author img

By

Published : Dec 9, 2021, 8:59 AM IST

rohit sharma captaincy news: టీమ్​ఇండియా వన్డే కెప్టెన్​గా రోహిత్ శర్మను నియమించడాన్ని పలువురు మాజీలు స్వాగతించారు. విరాట్‌ కోహ్లీ స్థానంలో భారత వన్డే జట్టుకు రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా బుధవారం ఎంపిక చేసింది బీసీసీఐ. కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ నుంచే రోహిత్‌.. టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. అతడికిప్పుడు వన్డే జట్టు పగ్గాలను కూడా అప్పగించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు టెస్టులు, మూడు వన్డేలను భారత్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎప్పటిలానే టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. రోహిత్‌ వన్డేతో సహా టీ20 జట్లకు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీ నిర్ణయంపై పలువురు స్పందించారు.

  • ఇది మంచి నిర్ణయం - మైఖేల్‌ వాన్‌, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్
  • భారత పురుషుల జట్టు వన్డే క్రికెట్‌లో నూతన శకం - అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)
  • తెల్లబంతి క్రికెట్‌లో మెన్‌ ఇన్‌ బ్లూ జట్టును నడిపేందుకు నంబర్‌ 45 (రోహిత్ శర్మ జెర్సీ) సిద్ధం - ముంబయి ఇండియన్స్, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ
  • విరాట్, రోహిత్‌ శర్మలతో కూడిన జట్లను రాహుల్‌ ద్రవిడ్‌ ఎలా నడిపిస్తాడో చూడాలి. విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడైనా అతడికి ఇదే సరైన సమయం. రోహిత్, విరాట్ ఇద్దరూ అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు. ఇద్దరు కెప్టెన్లతో ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుంది. రాహుల్‌కు ఇది కాస్త క్లిష్టమైందే. - హర్షా భోగ్లే, వ్యాఖ్యాత
  • విభిన్న ఫార్మాట్లకు ఇద్దరు సారథులను నియమించడం వల్ల డ్రెస్సింగ్‌ రూమ్‌లో మార్పులు తప్పవు. కోహ్లీ, రోహిత్‌లను సమన్వయం చేసుకోవడంలో రాహుల్‌ ద్రవిడ్‌ పెద్దన్న పాత్ర పోషించాలి - అయాజ్‌ మేమన్‌, క్రీడా విశ్లేషకులు

ఇదీ చూడండి: Virat Kohli: కోహ్లీకి షాక్‌.. కెప్టెన్సీ తొలగించడానికి కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.