బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇందోర్ వేదిగా భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. వరుసగా రెండు టెస్టులు గెలిచి ఊపుమీదున్న టీమ్ఇండియా.. మూడో టెస్టులో మాత్రం తడబడుతూ ఆడుతోంది. మొదటి రోజు టాస్ గెలచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 33.2 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పుకూలింది. ఓపెనర్లు రోహిత్, గిల్ మంచి స్టార్ట్‌ను అందించారు. కాగా, ఆసీస్ స్పిన్ ద్వయం కునెమన్, లయోన్ టీమ్ఇండియా బ్యాటర్లకు చెమటలు పట్టించారు. కేవలం 18 పరుగులు సమర్పించి ఐదు వికెట్లు పడగొట్టారు. మొదట రోహిత్ శర్మను ఔట్ చేశారు. ఆ తర్వాత గిల్, పుజారా, శ్రేయస్, జడేజా వరుసగా పెవీలియన్ బాట పట్టారు. అయితే జడేజా ఔట్ అయిన తీరు అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.
బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు మారిన తర్వాత జడేజా తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. లయోన్ వేసిన 11వ ఓవర్లో బంతి జడేజా ప్యాడ్‌కు తగిలింది. దీంతో లయోన్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ ఔట్ ప్రకటించాడు. అనంతరం జడేజా డీఆర్ఎస్ రివ్యూ తీసుకున్నాడు.బంతి బ్యాట్‌కు తాకినట్లు అల్ట్రా ఎడ్జ్ చూపించింది. దీంతో టీమ్ఇండియా ఊపిరిపీల్చుకుంది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆ వెంటనే లయోన్ వేసిన బంతిని జడేజా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంటి నేరుగా ఫీల్డర్ కునెమన్ చేతిలోకి వెళ్లింది. దీంతో జడ్డూ కేవలం నాలుగు పరుగులకే పెవీలియన్ చేరాడు. కాగా, జడేజా ఔట్ అయినప్పుడు రోహిత్ శర్మ, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ డిసప్పాయింట్ అయ్యారు. అప్పుడు వారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌట్ అయింది టీమ్ఇండియా. కోహ్లీ(22) కొద్దిగా ఫర్వాలేదనిపించినా... మిగతా వారంతా పేలవ ప్రదర్శన చేశారు. ఇక కంగారూ బౌలర్లలో 5 వికెట్లు పడగొట్టి కునెమన్ అద్భుత ప్రదర్శన చేశాడు. లయోన్ 3 వికెట్లతో రాణించగా.. టాట్ మర్ఫీ 1 వికెట్ తీశాడు.
- — MAHARAJ JI (@MAHARAJ96620593) March 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— MAHARAJ JI (@MAHARAJ96620593) March 1, 2023
">— MAHARAJ JI (@MAHARAJ96620593) March 1, 2023