ETV Bharat / sports

జడేజా ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో 5వ స్థానం - ఇండియా వర్సెస్​ ఇంగ్లాండ్​

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 2000 పరుగులు, 200 వికెట్లు తీసిన భారత క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు.

jadeja
జడేజా
author img

By

Published : Aug 7, 2021, 8:28 AM IST

ఇంగ్లాండ్​తో నాటింగ్​హామ్​ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్​లో టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 2000 పరుగులు చేసి, 200 వికెట్లు తీసిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.

తొలి టెస్ట్​ తొలి ఇన్నింగ్స్​లో 56పరుగులు చేశాడు జడేజా. ఫలితంగా టెస్టుల్లో 2వేల మైలురాయిని అందుకున్నాడు. ఇలా 2వేల పరుగులతో పాటు 200 వికెట్లు తీసిన భారత క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. కపిల్​ దేవ్​, అశ్విన్​, అనిల్​ కుంబ్లే, హర్భజన్​.. జడేజా ముందు ఉన్నారు. మొత్తం మీద 21వ ఆటగాడు జడేజా.

అయితే 53టెస్టుల్లోనే జడేజా 2వేల పరుగులు చేయడం విశేషం. ఇయాన్​ బాథమ్​(42), కపిల్​దేవ్​(50), ఇమ్రాన్​ ఖాన్​(50), అశ్విన్​(51).. జడెజా కన్నా ముందున్నారు.

వర్షం కారణంగా మూడో రోజు ఆట నిలిచిపోయే సమయానికి.. రెండో ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ 25/0లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్​లో 278పరుగులకు ఆలౌటైన టీమ్​ఇండియా ప్రస్తుతం 70 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇదీ చూడండి:- Mahendra Singh Dhoni: మహీకి 'ట్విట్టర్​' షాక్​.. కాసేపటికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.