టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని(Dhoni Ravi Shastri) ప్రశంసలతో ముంచెత్తాడు హెడ్ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri News). పరిమిత ఓవర్ల క్రికెట్కు మహీ అత్యుత్తమ సారథి అని కొనియాడాడు. అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్(T20 world cup 2021) తర్వాత టీమ్ఇండియా ప్రధానకోచ్(Team India Coach) రవిశాస్త్రి పదవీ కాలం పూర్తవుతుంది. ఈ సందర్భంగా కోచ్గా తాను సాధించిన విజయాలను ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు రవిశాస్త్రి.(Ravi Shastri News).
"పరిమిత ఓవర్ల క్రికెట్కు ధోని అత్యుత్తమ సారథి. ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్గా అతడు సాధించిన రికార్డులు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ అన్ని ఐసీసీ టోర్నీలు గెలిచాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రెండు ప్రపంచ కప్ టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్లో అతడికి సాటిలేదు. మీరు మహీని 'కింగ్ కాంగ్' అని పిలవొచ్చు."
--రవిశాస్త్రి, టీమ్ఇండియా హెడ్ కోచ్.
ఐపీఎల్లోనూ(IPL 2021) ధోని ఉత్తమ కెప్టెన్గా రాణించాడని కొనియాడాడు రవిశాస్త్రి. ధోని సారథ్యంలో సీఎస్కే(CSK Captain 2021) మూడు ఐపీఎల్ ట్రోఫీలు సొంతం చేసుకుందని గుర్తుచేశాడు. పరిస్థితులను అదుపు చేయడంలో మహీ మంచి అనుభవజ్ఞుడని తెలిపాడు. ధోనికేవరూ సాటిలేరని అన్నాడు.
ఇదీ చదవండి: