తమ దేశ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు అఫ్గానిస్థాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan). టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల్ని అతడికి అప్పగించింది అఫ్గాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ). టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రషీద్‌ను కెప్టెన్‌గా నియమించింది. నజిబుల్లా జద్రాన్‌కు వైస్‌కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది.
"ఎన్నో ఏళ్లుగా అతడికి ఉన్న అనుభవం, అద్భుత ప్రదర్శన, నాయకత్వ లక్షణాలను దృష్టిలో ఉంచుకుని రషీద్‌కు ఈ బాధ్యతలు అప్పగించాం" అని ఏసీబీ ప్రకటనలో తెలిపింది. తనను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు రషీద్. దేశానికి సేవ చేయడాన్ని గౌరవంగా భావిస్తానని అన్నాడు.
గతంలోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు రషీద్. వన్డేల్లో ఏడు, టెస్టుల్లో రెండు, టీ20ల్లో ఏడు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఇతడు జాతీయ జట్టుకు సారథ్యం వహించే ఆలోచన లేదని అనడం గమనార్హం.
మరోవైపు, టెస్టు, వన్డేలకు హస్మతుల్లా షాహిదిని సారథిగా, రెహ్మత్ షాను వైస్ కెప్టెన్‌గా నియమించింది అఫ్గాన్ బోర్డు.
ఇదీ చూడండి: Rashid Khan: 'మళ్లీ ఆ బాధ్యతలు వద్దు'