ETV Bharat / sports

ఐపీఎల్​ ముగింపు వేడుకలకు రెహ్మాన్​, రణ్​వీర్​! - ఐపీఎల్ ముగింపు వేడుకలు

IPL 2022 Ranveersingh, AR Rahman: ఐపీఎల్​ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్​ చేస్తోంది బీసీసీఐ. ఈ కార్యక్రమంలో బాలీవుడ్​ స్టార్​ రణ్​వీర్​ సింగ్​, ఏఆర్​ రెహ్మాన్ సందడి​ చేయనున్నట్లు తెలిసింది.

ipl 2022 ranveersingh ar rahman
ఐపీఎల్ 2022 ఏఆర్​ రెహ్మాన్​ రణ్​వీర్​ సింగ్​
author img

By

Published : May 12, 2022, 1:53 PM IST

IPL 2022 Ranveersingh, AR Rahman: కరోనా వల్ల గత రెండేళ్లుగా ఐపీఎల్​ ఆరంభ, ముగింపు వేడుకలను నిర్వహించని బీసీసీఐ.. ఈ సీజన్​ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆస్కార్​ విజేత ఏఆర్​ రెహ్మాన్​, స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​లతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేయించేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది. మే 29న జరిగే ఫైనల్​ మ్యాచ్​కు ముందు 45 నిమిషాల పాటు ఈ ప్రోగ్రాం జరగనుందట.

దీంతోపాటు టీమ్​ఇండియా కెప్టెన్లుగా వ్యవహరించిన వారందరినీ ఘనంగా సత్కరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే భారత క్రికెట్​ ప్రస్థానానికి సంబంధించి ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా రూపొందించారని, దాన్ని ఈ వేడుకలో ప్రదర్శిస్తారని సమాచారం. కాగా, ప్రస్తుతం ఐపీఎల్​లో ప్లే ఆఫ్స్​ బెర్తుల కోసం ఉత్కంఠగా మ్యాచులు సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్​కు చేరబోయే నాలుగు జట్లలో.. గుజరాత్​ టైటాన్స్​ తొలి బెర్తు కన్ఫార్మ్​ చేసుకోగా, మిగిలిన మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

ఇదీ చూడండి: 100 మీటర్ల హర్డిల్స్​లో 'తెలుగమ్మాయి' జాతీయ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.