ETV Bharat / sports

ముంబయి సారథిగా పృథ్వీ షా.. అర్జున్​ తెందూల్కర్​కు జట్టులో చోటు

author img

By

Published : Dec 30, 2021, 10:48 AM IST

Ranji Trophy 2021-22: రంజీ ట్రోఫీ 2021-22 సీజన్​ కోసం రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు పలు టీమ్​లు తమ స్క్వాడ్​ను ప్రకటిస్తున్నాయి. తాజాగా యువ ఆటగాడు పృథ్వీ షాను కెప్టెన్​గా నియమించింది ముంబయి జట్టు. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​ జట్టు.. స్పిన్నర్ కుల్​దీప్​ను సారథిగా ప్రకటించింది.

prithvi shah, kuldeep yadav
పృథ్వీ షా, కుల్​దీప్

Ranji Trophy 2021-22: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2021-22 సీజన్​ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది బీసీసీఐ. అయితే.. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది ముంబయి. భారత ఆటగాడు పృథ్వీ షా ఈ టీమ్​కు సారథిగా వ్యవహరించనున్నాడు.

యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అర్మాన్ జాఫర్, ఆదిత్య తారే, శివమ్ దూబేవంటి మెరుగైన ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ ముంబయి రంజీ జట్టులో చోటు సంపాదించాడు.

arjun tendulkar
అర్జున్ తెందూల్కర్

"అర్జున్‌ నిలకడగా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. కొంతకాలం గాయం కారణంగా ఇబ్బందిపడిన అతడు ప్రస్తుతం మంచి లయలో ఉన్నాడు" అని ముంబయి సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సలీల్‌ అంకోలా చెప్పాడు. అర్జున్‌ నిరుడు ముంబయి సీనియర్‌ జట్టులో చోటు సంపాదించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ ఆడాడు.

యూపీ జట్టుకు కుల్​దీప్..

రంజీ ట్రోఫీలో నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. టీమ్​ఇండియా స్పిన్నర్ కుల్​దీప్ యాదవ్​.. యూపీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. కరుణ్ శర్మ వైస్​ కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

ప్రియమ్ గార్గ్, శివమ్​ మావి వంటి ఆటగాళ్లతో యూపీ జట్టు దృఢంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి:

దేశవాళీ క్రికెట్​కు రంగం సిద్ధం.. షెడ్యూల్ ఇదే

Ranji trophy 2021: రంజీ ట్రోఫీ గ్రూప్స్​పై బీసీసీఐ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.