Ramiz Raja Commentary On Babar Azam : పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌పై.. పాక్ కికెట్ బోర్డు- పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా వింత వ్యాఖ్యలు చేశాడు. బాబర్ అంటే తనకు చాలా ఇష్టమని.. తనను పెళ్లి చేసుకోవాలని ఉందని అన్నాడు. రమీజ్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
అసలు ఏం జరిగిందంటే?
బాబర్ అజామ్.. ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో స్ట్రయికర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సోమవారం గాలో టైటాన్స్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలంబో సారథి బాబర్ అద్భుత ప్రదర్శన చేసి.. సుడిగాలి శతకం బాదాడు. 59 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రజా కామెంటరీ చేశాడు. ఈ క్రమంలో బాబర్ అజామ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. "అద్భుతం.. క్లాస్, క్వాలిటీ, సెక్యూరిటీ కలిసి ఉన్న ఫిఫ్టీ. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆధారపడగలిగిన ఆటగాడు అతడు. నేను అతడిని చాలా ప్రేమిస్తున్నాను.. అవును, అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను" అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం రజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు రమీజ్ రజాను ట్రోల్ చేస్తున్నారు.
-
HE REALLY SAID THAT😭 pic.twitter.com/BfFXicISpa
— faamia (@papukashmiri1) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">HE REALLY SAID THAT😭 pic.twitter.com/BfFXicISpa
— faamia (@papukashmiri1) August 7, 2023HE REALLY SAID THAT😭 pic.twitter.com/BfFXicISpa
— faamia (@papukashmiri1) August 7, 2023
చెలరేగిన బాబర్ అజామ్..
Lanka Premier League 2023 : గాలే టైటాన్స్ విధించిన 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది కొలంబో జట్టు. ఓపెనర్ నిస్సాంక (54) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ బాబర్ అజామ్ (104) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి శతక్కొట్టాడు. 8 ఫోర్లు, 5 సిక్సర్లు బాది టీ20 ఫార్మాట్‌లో మొత్తంగా 10 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తర్వాతి స్థానాన్ని అధిగమించాడు. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది కొలంబో.
ఉంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గాలే టైటాన్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్లు లసిత్ క్రాస్పుల్లే (36), శివావ్ డానియెల్ (49) అద్భతంగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన రాజపక్ష (30), సిఫెర్ట్ (54*), శనక (6*) చెలరేగి స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఇక, కొలంబో బౌలర్లలో నసీం షా, మెండిస్, సందకన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
వన్డేల్లో బాబర్ అజామ్ ప్రపంచ రికార్డ్.. కోహ్లీని అధిగమించిన పాక్ కెప్టెన్!
'ఐపీఎల్ కంటే బిగ్‌బాష్ బెస్ట్'.. బాబర్ కామెంట్స్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్!