Rahul Dravid Son Cricket : టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ కర్ణాటక అండర్-19 జట్టులోకి మెంబర్‌గా ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న వినూ మన్కడ్ ట్రోఫీ నేపథ్యంలో కర్ణాటక జట్టులోకి ఎంపికైన 15 మంది సభ్యుల్లో ఈ 17 ఏళ్ల యంగ్ ప్లేయర్ భాగమయ్యాడు. ధీరజ్ గౌడ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టుకు, ధృవ్ ప్రభాకర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హర్షిల్ ధర్మాని, యువరాజ్ అరోరా కూడా వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. హైదరాబాద్ వేదికగా వినూ మన్కడ్ టోర్నీ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. అట్టహాసంగా జరగనున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 20న జరగనుంది.
Rahul Dravid Son Anvay Dravid : ద్రవిడ్ రెండో తనయుడు అన్వయ్ కూడా క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. రెండేళ్ల క్రితం అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అన్వయ్.. అన్నయ్య సమిత్‌తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరి మెప్పు పొందాడు. అలా బీటీఆర్ షీల్డ్ అండర్ 14 స్కూల్ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరూ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి రికార్డుకెక్కారు. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన అన్వయ్ ద్రవిడ్.. 90 పరుగులు చేసి శతకానికి చేరువయ్యాడు. మరోవైపు ఈ ఏడాది జనవరిలో జరిగిన U-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక U-14 జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు 2019-20 ఇంటర్-జోనల్ మ్యాచ్‌లలో అతను 2 డబుల్ సెంచరీలు సాధించాడు.
Vinoo Mankad Trophy Karnataka Team : కర్ణాటక అండర్ 19 జట్టు: ధీరజ్ జె. గౌడ (కెప్టెన్), ధృవ్ ప్రభాకర్ (వైస్ కెప్టెన్), శివమ్ సింగ్, కార్తీక్ ఎస్‌యూ, సమిత్ ద్రవిడ్, యువరాజ్ అరోరా (వికెట్ కీపర్), హార్దిక్ రాజ్, ఆరవ్ మహేష్, ఆదిత్య నాయర్, ధనుశ్ గౌడ, హర్షిల్ ధర్మాని (వికెట్ కీపర్), శిఖర్ శెట్టి, సమర్థ్ నాగరాజ్, కార్తికేయ కెపి, శేషిత్