దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీమ్ఇండియా-ఏ, సౌతాఫ్రికా-ఏ మ్యాచ్‌లో(IND A vs SA A match) అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్(Rahul Chahar News) అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. కొద్దిసేపు వాగ్వాదానికి దిగాడు.
అసలేం జరిగిందంటే?
బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా రెండో రోజు మ్యాచ్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో రాహుల్ 128వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్లో రాహుల్ విసిరిన బంతి.. క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న క్యూషీలే ప్యాడ్స్‌ను తాకింది. అది ఎల్బీడబ్ల్యూగా భావించిన రాహుల్ వెంటనే అంపైర్‌ను అప్పీల్ చేశాడు. అంపైర్ ఔట్‌గా పరిగణించని కారణంగా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయిన రాహుల్.. తన సన్‌గ్లాసెస్‌ను నేలపైకి విసిరాడు. ఆ తర్వాత కొద్దిసేపు అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. రాహుల్ చాహర్ ప్రవర్తనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
-
Rahul Chahar might get pulled up here, showing absolute dissent to the umpires call.
— Fantasy Cricket Pro (@FantasycricPro) November 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A double appeal and throwing his equipment. #SAAvINDA
Footage credit - @SuperSportTV pic.twitter.com/TpXFqjB94y
">Rahul Chahar might get pulled up here, showing absolute dissent to the umpires call.
— Fantasy Cricket Pro (@FantasycricPro) November 24, 2021
A double appeal and throwing his equipment. #SAAvINDA
Footage credit - @SuperSportTV pic.twitter.com/TpXFqjB94yRahul Chahar might get pulled up here, showing absolute dissent to the umpires call.
— Fantasy Cricket Pro (@FantasycricPro) November 24, 2021
A double appeal and throwing his equipment. #SAAvINDA
Footage credit - @SuperSportTV pic.twitter.com/TpXFqjB94y
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఏ జట్టు 509 పరుగులు చేసింది. బరిలోకి దిగిన టీమ్ఇండియా ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 96 పరుగులతో అదరగొట్టగా, అభిమన్యు ఈశ్వరన్ 103 పరుగులు చేశాడు. ఓపెనర్ పృథ్వీ షా 48 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇదీ చదవండి: