Rachin Ravindra World Cup : రచిన్ రవీంద్ర.. వరల్డ్ కప్‌లో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతోంది. భారత సంతతికి చెందిన ఈ న్యూజిలాండ్ ప్లేయర్.. మైదానంలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి.. 23 ఏళ్ల వయసులోనే ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. తన తండ్రి పెట్టిన పేరుకు తగ్గట్టుగా రాహుల్ ద్రవిడ్, సచిన్ లాగా ఆడి చరిత్ర సృష్టిస్తున్నాడు. తన అరంగేట్ర ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు మూడు శతకాలు బాది సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో రానున్న కాలంలో ఇతను స్టార్ క్రికెటర్‌గా ఎదగడంలో ఎటువంటి సందేహం లేదని క్రికెట్ మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రచిన్ నానమ్మ- తాతయ్యలు ( పూర్ణిమ, బాలకృష్ణ) ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు వారు అక్కడికి వచ్చారు. తన నానమ్మ - తాతయ్య స్టాండ్స్‌లోంచి చూస్తుండగా రచిన్ శతకం పూర్తి చేశాడు. ఈ సందర్భంగా రచిన్ తాతయ్య తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండియాతో జరిగే ఫైనల్స్‌లో తన మనవడు ఆడాలని ఆయన అన్నారు. తాజాగా ఈటీవీ భారత్‌కు ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన తన మనవడి గురించి పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు.
"1999లో రచిన్ పుట్టాడు. అతడి తండ్రి రవి కృష్ణమూర్తి రచిన్‌కు తొలి గురు. క్లబ్ క్రికెట్‌లో ఆడటం వల్ల రచిన్‌కు క్రికెట్‌లో అనుభవం ఉంది. ఇక తన తండ్రితో పాటు రచిన్ కూడా పలు ప్రాంతాలకు క్లబ్ క్రికెట్ ఆడేందుకు వెళ్లేవాడు. ఇక అప్పటి నుంచి తనకు క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది." అని రచిన్ తొలి అడుగుల గురించి తాతయ్య బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
-
Named after two absolute legends, and both Rahul & Sachin will be proud of the knock #RachinRavindra played today!
— Star Sports (@StarSportsIndia) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Sensational 💯 on World Cup debut by the youngster! 😍
Tune-in to #WorldCupOnStar
5th Oct to 19th Nov | Star Sports Network#CWC23 #Cricket pic.twitter.com/gGgMB5OTs5
">Named after two absolute legends, and both Rahul & Sachin will be proud of the knock #RachinRavindra played today!
— Star Sports (@StarSportsIndia) October 5, 2023
Sensational 💯 on World Cup debut by the youngster! 😍
Tune-in to #WorldCupOnStar
5th Oct to 19th Nov | Star Sports Network#CWC23 #Cricket pic.twitter.com/gGgMB5OTs5Named after two absolute legends, and both Rahul & Sachin will be proud of the knock #RachinRavindra played today!
— Star Sports (@StarSportsIndia) October 5, 2023
Sensational 💯 on World Cup debut by the youngster! 😍
Tune-in to #WorldCupOnStar
5th Oct to 19th Nov | Star Sports Network#CWC23 #Cricket pic.twitter.com/gGgMB5OTs5
"న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో రచిన్, కేన్ విలియమ్సన్ ఒకే జట్టుకు ఆడతారు. కాబట్టి కేన్‌కు రవీంద్ర ఆడే సామర్థ్యం గురించి బాగా తెలుసు. అతనికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని నేను ఆశిస్తున్నాను. అలాగే అతనికి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మన దేశ సీనియర్ ఆటగాళ్లు రచిన్ ఆటను హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది" అని రచిన్ తాతయ్య తెలిపారు.
"పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు నేను గ్రౌండ్‌కు వెళ్లాను. రచిన్ సెంచరీ చేసినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. అయితే మ్యాచ్ తర్వాత నేను అతన్ని కలవడానికి ప్రయత్నించాను. కానీ, ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం అనుమతి లేనందున ఆ అవకాశం నాకు దక్కలేదు. అతను టోర్నమెంట్ ముగిసిన తర్వాత నేరుగా న్యూజిలాండ్ వెళ్తాడు. గతేడాది బెంగళూరులో మాతో సెలవులు గడిపాడు. క్రికెట్ కోసం ప్రస్తుతం రచిన్ డైట్లో ఉన్నాడు. కానీ అతనికి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా దోస, ఇడ్లీ.. లాంటివి చాలా బాగా తింటాడు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అవే తింటాడు." అని బాలకృష్ణ తెలిపారు.
-
A landmark innings! The first player for the team to have three @cricketworldcup hundreds. Follow play LIVE in NZ with @skysportnz. LIVE scoring | https://t.co/3Nuzua3Jiu #CWC23 pic.twitter.com/XlhZedZGHM
— BLACKCAPS (@BLACKCAPS) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A landmark innings! The first player for the team to have three @cricketworldcup hundreds. Follow play LIVE in NZ with @skysportnz. LIVE scoring | https://t.co/3Nuzua3Jiu #CWC23 pic.twitter.com/XlhZedZGHM
— BLACKCAPS (@BLACKCAPS) November 4, 2023A landmark innings! The first player for the team to have three @cricketworldcup hundreds. Follow play LIVE in NZ with @skysportnz. LIVE scoring | https://t.co/3Nuzua3Jiu #CWC23 pic.twitter.com/XlhZedZGHM
— BLACKCAPS (@BLACKCAPS) November 4, 2023
రఫ్పాడించిన రచిన్ - తెందూల్కర్ రికార్డు బ్రేక్, తొలి కివీస్ బ్యాటర్‌గా రికార్డ్
ODI World cup 2023 Rachin Ravindra : 'భారతీయ మూలాలు ఉన్నా.. వందశాతం కీవీస్ ప్లేయర్‌నే'