Punjab kings Captain Mayank Agarwal: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ అధికార ప్రకటన వచ్చేసింది. మయాంక్ అగర్వాల్‌ను సారథిగా నియమించినట్లు ఫ్రాంఛైజీ తెలిపింది. సోషల్‌మీడియాలో ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. వేలంకు ముందే మయాంక్(రూ.12కోట్లు), పేసర్ హర్షదీప్సింగ్ను(రూ.4కోట్లు) పంజాబ్ రిటెయిన్ చేసుకుంది. కాగా, తనను సారథిగా ఎంపిక చేసినందుకు హర్షం వ్యక్తం చేశాడు మయాంక్.
"నాపై పంజాబ్ యాజమాన్యం నమ్మకం ఉంచి జట్టు పగ్గాలు అప్పజెప్పినందుకు ధన్యవాదాలు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తా. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో ఈ సీజన్లో పంజాబ్ జట్టు మరింత బలంగా తయారైంది."
- పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్
మయాంక్ 2018వ సంవత్సరం నుంచి పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్(పంజాప్ పాత కెప్టెన్) జోడీ ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసింది. గత సీజన్ తర్వాత జట్టుకు నుంచి బయటకు వచ్చిన రాహుల్ ప్రస్తుతం కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతేడాది రాహుల్‌కు గాయమైన సమయంలో మయాంక్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనుభవం కూడా ఉంది. గత రెండు సీజన్లలో 400కు పైగా పరుగులు సాధించాడు. 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టిన అతడు 100కు పైగా మ్యాచులు ఆడగా..భారత్ తరఫున 19 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు.
-
🚨 Attention #SherSquad 🚨
— Punjab Kings (@PunjabKingsIPL) February 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Our 🆕© ➜ Mayank Agarwal
Send in your wishes for the new #CaptainPunjab 🎉#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @mayankcricket pic.twitter.com/hkxwzRyOVA
">🚨 Attention #SherSquad 🚨
— Punjab Kings (@PunjabKingsIPL) February 28, 2022
Our 🆕© ➜ Mayank Agarwal
Send in your wishes for the new #CaptainPunjab 🎉#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @mayankcricket pic.twitter.com/hkxwzRyOVA🚨 Attention #SherSquad 🚨
— Punjab Kings (@PunjabKingsIPL) February 28, 2022
Our 🆕© ➜ Mayank Agarwal
Send in your wishes for the new #CaptainPunjab 🎉#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @mayankcricket pic.twitter.com/hkxwzRyOVA
శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లింవింగ్స్టోన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, రాహుల్ చహార్, తమిళనాడు సంచలనం షారుక్ ఖాన్ సహా పలువురు ఆటగాళ్లను పంజాబ్ జట్టు ఈ సారి మెగా వేలంలో దక్కించుకుంది.
ఇదీ చదవండి: లంకను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ ఇండియా.. రోహిత్ సేన రికార్డు