Players Last World Cup : 2023 వరల్డ్‌కప్ ముగిసింది. ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ప్రపంచకప్ కోసం 12 ఏళ్ల టీమ్ఇండియా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. అయితే అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న భారత్.. ఈసారి కచ్చితంగా కప్పు కొడుతుందని ఆశించారంతా. కానీ, చివరి మ్యాచ్‌లో టీమ్ఇండియాకు కలిసి రాలేదు. మరో వరల్డ్‌కప్ కోసం ఇంకో నాలుగేళ్లు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ప్లేయర్లు.. వయసు రీత్య 2027లో టీమ్ఇండియాలో ఉండకపోవచ్చు.
ఫిట్నెస్ ఇబ్బందులతో ఆయా ప్లేయర్లు 2027 వరల్డ్‌కప్ ఆడటం కష్టమనే చెప్పాలి. ఈ క్రమంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెక్ట్స్ వరల్డ్‌కప్ ఆడటం అనుమానమే. ప్రస్తుతం అతడి వయసు 36 ఏళ్లు. ఫిట్నెస్ సమస్యలతో రోహిత్.. ఇప్పుడే అన్ని మ్యాచ్‌లు ఆడడం లేదు. దీంతో వచ్చే ప్రపంచకప్ నాటికి అతడు 40 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఆ వయసులో పూర్తి ఫిట్నెస్ సాధించడం కష్టమే.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఇప్పుడు ఫిట్నెస్ పరంగా విరాట్‌కు ఇబ్బందులు లేవు. అయితే, నాలుగేళ్లనాటికి అంటే.. 39 ఏళ్లకు అతడు ఇంతే ఫిట్‌గా ఉంటాడని చెప్పలేం. అతడి ఆటతీరు ఇలాగే కొనసాగితే.. 2027లో ఆడే ఛాన్స్ ఉంది. కానీ, అది అంత సులువేం కాదు.
-
Quick off the blocks! ⚡️ ⚡️#TeamIndia zoom past FIFTY-run mark in 7 overs 👏 👏
— BCCI (@BCCI) November 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#CWC23 | #MenInBlue | #INDvAUS | #Final pic.twitter.com/AwDVdG4BCW
">Quick off the blocks! ⚡️ ⚡️#TeamIndia zoom past FIFTY-run mark in 7 overs 👏 👏
— BCCI (@BCCI) November 19, 2023
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#CWC23 | #MenInBlue | #INDvAUS | #Final pic.twitter.com/AwDVdG4BCWQuick off the blocks! ⚡️ ⚡️#TeamIndia zoom past FIFTY-run mark in 7 overs 👏 👏
— BCCI (@BCCI) November 19, 2023
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#CWC23 | #MenInBlue | #INDvAUS | #Final pic.twitter.com/AwDVdG4BCW
-
9⃣th FIFTY-plus score in #CWC23! 👏 👏
— BCCI (@BCCI) November 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
7⃣2⃣nd FIFTY in ODIs! 👌 👌
Virat Kohli continues his impressive run of form as #TeamIndia move past 130 in the #Final.
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#MenInBlue | #INDvAUS pic.twitter.com/TMYYiJNeja
">9⃣th FIFTY-plus score in #CWC23! 👏 👏
— BCCI (@BCCI) November 19, 2023
7⃣2⃣nd FIFTY in ODIs! 👌 👌
Virat Kohli continues his impressive run of form as #TeamIndia move past 130 in the #Final.
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#MenInBlue | #INDvAUS pic.twitter.com/TMYYiJNeja9⃣th FIFTY-plus score in #CWC23! 👏 👏
— BCCI (@BCCI) November 19, 2023
7⃣2⃣nd FIFTY in ODIs! 👌 👌
Virat Kohli continues his impressive run of form as #TeamIndia move past 130 in the #Final.
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#MenInBlue | #INDvAUS pic.twitter.com/TMYYiJNeja
పేస్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా ప్రపంచకప్‌కు గుడ్‌బై చెప్పినట్లే. ప్రస్తుతం 33 ఏళ్ల వయసున్న షమీ.. ఇంకో నాలుగేళ్లు జట్టులో కొనసాగే ఛాన్స్ దాదాపు లేనట్టే. దీంతో కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఈ పేసర్ వచ్చే వరల్డ్‌కప్ ఆడకపోవచ్చు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్ (37), రవీంద్ర జడేజా (34) కూడా 2027 మెగాటోర్నీలో ఆడకపోవచ్చు.
టీమ్ఇండియా ఆటగాళ్లతోపాటు.. మహమ్మద్ నబి (38), డేవిడ్ వార్నర్ (37), స్టీవ్ స్మిత్ (34), స్టార్క్ (33), కేన్ విలియమ్సన్ (33), ట్రెంట్ బౌల్ట్ (34), టిమ్ సౌథీ (34), 36 ఏళ్ల షకిబుల్ హసన్, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, క్రిస్‌వోక్స్, ఆదిల్ రషీద్, బవుమా, మిల్లర్, వాండర్ డసన్కు కూడా ఇదే ఆఖరి వరల్డ్‌కప్ అనడంలో డౌట్ లేదు.