ETV Bharat / sports

Jarvo 69: బౌలింగ్​ చేశాడు.. జైలు పాలయ్యాడు - జార్వో అరెస్టు

ఇంగ్లాండ్, భారత్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన క్రికెట్ అభిమాని, యూట్యూబర్ జర్వోను(Jarvo 69) లండన్ పోలీసులు అరెస్టు చేశారు.

jarvo
జార్వో
author img

By

Published : Sep 4, 2021, 12:44 PM IST

ఇంగ్లాండ్​లోని ఓవల్ స్టేడియంలో.. భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు(Ind vs Eng 4th test 2021) జరుగుతుండగా క్రికెట్ అభిమాని డేనియల్ జర్వో(Jarvo Ind vs Eng) మరోసారి ప్రత్యక్షమయ్యాడు. వేగంగా మైదానంలోకి దూసుకొచ్చి బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో నాన్​ స్ట్రైకింగ్ ఎండ్​లో ఉన్న బెయిర్​స్టోను ఢీకొట్టాడు. అయితే.. ఈ ఘటన అనంతరం యూట్యూబర్ జార్వోను పోలీసులు అరెస్టు చేశారు.

'అనుమానాస్పద దాడి' కింద జార్వోను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇంకా దక్షిణ లండన్​ పోలీస్​ స్టేషన్​ కస్టడీలో ఉంచినట్లు పేర్కొన్నారు.

మ్యాచ్​ మధ్యలో ఇలా అంతరాయం కలిగించే ప్రయత్నం చేయడం జర్వోకు(Jarvo cricket) మూడోసారి. అయితే.. జర్వో తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు వ్యవహరించిన తీరు సరికాదని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

బ్యాటింగ్​కు దిగిన ఫ్యాన్.. మైదానంలో ఫుల్ కామెడీ!

Jarvo 69: మెరుపు వేగంతో దూసుకొచ్చిన బౌలర్ - బాట్స్​మన్​ హడల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.