ప్రపంచం నుంచి జాత్యాహంకారాన్ని పూర్తిగా పారదోలడం కష్టమేనని అన్నాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్. అమెరికా నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్.. ఓ పోలీసు అధికారి కర్కశత్వానికి బలైన తీరు అప్పట్లో సంచలనం సృష్టించింది. మంగళవారం జార్జి తొలి వర్ధంతి సందర్భంగా అతడిని గుర్తుచేసుకుని ఈ వ్యాఖ్యలు చేశాడు హోల్డింగ్.
"జాతివివక్ష, దాన్ని ప్రేరేపించే వారు ఎప్పుడూ ఉంటారు. జాత్యాహంకారం పూర్తిగా తొలిగిపోవడమంటే సమాజంలో నేరాలన్నీ పూర్తిగా ఆగిపోయినట్లే. కానీ అది అసాధ్యం. ప్రతి ఒక్కరూ ఈ వివక్షను వ్యతిరేకించి, నల్లజాతీయులకు మద్దతుగా నిలబడాలి. జీవితకాలం పాటు వారు జాతి వివక్షను ఎదుర్కోవడం ఎంత కష్టంగా ఉంటుందో ప్రజలకు అర్థం కాదు!." అని భావోద్వేగానికి గురయ్యాడు హోల్డింగ్.
ఇదీ చూడండి: 'హమ్మయ్యా.. ఔట్ డోర్ శిక్షణ ప్రారంభించాం'