ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్(James Pattinson News).. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ జట్టు తరఫునే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేసే ఆటగాళ్లలో ఇతడు ఒకడు.
కుటుంబంతో గడపడం, రాష్ట్రం తరఫున ఆడటం, భవిష్యత్తు పేస్ బౌలర్లను తీర్చిదిద్దేందుకే వీడ్కోలు నిర్ణయం తీసకున్నట్లు పాటిన్సన్(James Pattinson Retirement) చెప్పాడు. దీంతో పాటు కొన్ని రోజులుగా అతడు మోకాలి గాయంతో బాధపడుతుండటం కూడా రిటైర్మెంట్కు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఆసీస్ తరఫున 21 టెస్టులు, 15 వన్డేలు, 4 టీ20లు ఆడిన పాటిన్సన్.. టెస్టుల్లో 81 వికెట్లు తీశాడు. 76 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 302 వికెట్లు పడగొట్టాడు.
2011లో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడిన పాటిన్సన్.. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆ సిరీస్‌లో మొత్తంగా 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. తన ఎంట్రీగా ఘనంగా చాటాడు.
ఇదీ చదవండి: