Pant Health Update : వన్డే ప్రపంచకప్ - 2023కు ముందు టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త అందింది. గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్.. అనుకున్న సమయం కన్నా త్వరగానే కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడట. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో పునరావాసం పొందుతున్నాడు.
ఇక నో సర్జరీ.. రోడ్డు ప్రమాదానికి గురైన అతడికి వైద్యులు పలు సర్జరీలు చేశారు. దీంతో అతడు ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలోనే అతడికి మరో మైనర్ సర్జరీ అవసరమని మొదట వైద్యులు సూచించారు. కానీ ఇప్పుడు పంత్ మరింత మెరుగ్గా కోలుకోవడం వల్ల.. అతడి మరో సర్జరీ అవసరం లేదని వైద్యులు భావించారట. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
Pant Health Condition : "పంత్‌కు ఇప్పటికే పలు సర్జరీలు చేశారు. అయితే అతడికి మరో మైనర్ సర్జరీ చేయాలని మొదట వైద్యులు ఉన్నారు. అతడిని ప్రతి పదిహేను రోజులకు ఓసారి వైద్యులు పరిశీలిస్తూనే ఉన్నారు. అతడు బాగా కోలుకుంటున్నాడు. అందుకే అతడికి మరో ఎటువంటి సర్జరీలు అవసరం లేదని ఇప్పుడు వైద్యలు అన్నారు. ఇది చాలా మంచి విషయం. పంత్ మొదట ఊహించిన దానికన్నా.. ముందుగానే మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి" అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి అన్నారు.
-
Happy NO MORE CRUTCHES Day!#RP17 pic.twitter.com/mYbd8OmXQx
— Rishabh Pant (@RishabhPant17) May 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy NO MORE CRUTCHES Day!#RP17 pic.twitter.com/mYbd8OmXQx
— Rishabh Pant (@RishabhPant17) May 5, 2023Happy NO MORE CRUTCHES Day!#RP17 pic.twitter.com/mYbd8OmXQx
— Rishabh Pant (@RishabhPant17) May 5, 2023
Rishabh Pant ODI World Cup : దీంతో అతడు భారత్ వేదికగా జరగనున్న.. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశముందని క్రికెట్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరో రెండు మూడు నెలల్లో తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ విషయం తెలిసి అతడి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మైదానంలో అతడి ఆటను తిరిగి చూడాలని ఆశిస్తున్నారు. కాగా, గతేడాది డిసెంబర్ నుంచి పంత్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్-2023 సీజన్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. ఇకపోతే ఐపీఎల్లో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న దిల్లీ క్యాపిటల్స్ టీమ్ పేలవ ప్రదర్శనతో లీగ్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది. ఐపీఎల్ 2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.
స్విమ్మింగ్ పూల్‌లో పంత్.. వీడియో వైరల్.. ఆరోగ్యం ఎలా ఉందంటే?
ప్రమాదం తర్వాత మొదటిసారి నడిచిన రిషభ్ పంత్.. ఫొటోలు వైరల్!