కొన్ని అలవాట్లు ఎంత మార్చుకుందామనుకున్నా, వదులుకుందామనుకున్నా.. మార్చుకోలేం, వదులుకోలేం. ఈ సామెత పాకిస్థాన్ క్రికెట్ జట్టు విషయంలోనూ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. పాక్ జట్టు ఫీల్డింగ్ గమనిస్తే ఇది అర్థమవుతుంది. చాలా మ్యాచ్‌ల్లోనూ కొన్సి సింపుల్ క్యాచ్‌లను మిస్ చేస్తూ.. పాక్ ఫీల్డర్లు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నారు. ఇప్పటికే పలుమార్లు పాక్ ఆటగాళ్లు క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నించి ఢీకొనడం లేదా ఒకరినొకరు చూసుకోవడం వల్ల క్యాచ్‌లను వదిలేయడం జరుగుతోంది. అలానే ఈసారి ఆసియా కప్‌లో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంది తప్పిదాలే చేశారు. ఇప్పుడీ ఆసియా కప్ ఫైనల్లోనూ ఇదే తప్పిదం చేసింది బాబర్ జట్టు. ఈ మ్యాచ్‌లో పాక్ ఫీల్డర్లు బౌండరీ లైన్ లోపలే నేలను తాకాల్సిన బంతిని బౌండరీ లైన్ బయటకు చేర్చి శ్రీలంకకు ఆరు పరుగులు సమర్పించుకున్నారు.
ఇదీ జరిగింది.. శ్రీలంక 58 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో భానుక రాజపక్స రంగంలోకి దిగి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. 18.6వ ఓవర్‌లో మహమ్మద్ హస్నైన్ వేసిన బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. గాల్లో ఉన్న ఈ బంతిని అందుకొనేందుకు అక్కడే ఉన్న అసిఫ్ అలీ ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో షాదాబ్ ఖాన్ గుడ్డిగా ఆ దిశగా పరిగెత్తుకొంటూ వచ్చి అలీను ఢీకొన్నాడు. అప్పటికే అలీ చేతికందిన బంతి.. షాదాబ్ ఢీకొనడంతో బౌండరీ లైన్ బయటపడింది. ఫలితంగా శ్రీలంకకు ఓ సిక్సర్ లభించింది. అసలు ఆ క్యాచ్‌ను వదిలేసినా ఫోర్ మాత్రమే లంకకు లభించేది.. రెండు పరుగులు పాక్‌కు ఆదా అయ్యేవి..!
అలీని ఢీకొన్న షాదాబ్ నేలపైనే పడిపోవడంతో వైద్య బృందం అక్కడకు వచ్చి చికిత్సను అందించింది. ఈ ఇన్నింగ్స్‌లో భానుక 2 సిక్స్‌లు, 6 ఫోర్ల సాయంతో 45 బంతుల్లో 71 పరుగులు చేసి లంకకు గౌరవప్రదమైన (170/6) స్కోర్ అందించాడు.
-
ये छक्का क्रिकेट इतिहास में हमेशा याद रखा जाएगा. pic.twitter.com/yunCTCBufY
— उम्दा_पंक्तियां (@umda_panktiyan) September 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ये छक्का क्रिकेट इतिहास में हमेशा याद रखा जाएगा. pic.twitter.com/yunCTCBufY
— उम्दा_पंक्तियां (@umda_panktiyan) September 11, 2022ये छक्का क्रिकेट इतिहास में हमेशा याद रखा जाएगा. pic.twitter.com/yunCTCBufY
— उम्दा_पंक्तियां (@umda_panktiyan) September 11, 2022
ఇదీ చూడండి: ఇదేం బౌలింగ్ భయ్యా.. తొలి బంతికే 10 పరుగులు!