ETV Bharat / sports

తొలి బంతికి రెండు ముక్కలైన బ్యాట్​.. రెండో బాల్​కు ఆఫ్ స్టంప్ గాల్లో పల్టీలు..

పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ 2023లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్​లో బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య భీకర పోరు జరిగింది. అయితే ఓ బౌలర్​ వేసిన తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది. అంతేకాకుండా అతడు వేసిన రెండో బంతి వేగానికి ఆఫ్‌‌ స్టంప్‌ గాల్లో పల్టీలు కొట్టింది. ఆ వీడియో మీకోసం..

Pakisthan cricket league
తొలి బంతికి రెండు ముక్కలైన బ్యాట్​.. రెండో బాల్​కు ఆఫ్ స్టంప్ గాల్లో పల్టీలు..
author img

By

Published : Feb 27, 2023, 5:00 PM IST

పాకిస్థాన్ సూపర్ లీగ్​ 2023లో అదిరిపోయే సంఘటన జరిగింది. ఈ సంఘటన నెటిజన్లను, క్రికెట్​ ప్రియులను బాగా ఆకట్టుకుంది. అదేంటంటే.. లాహోర్‌ ఖలందర్స్‌-పెషావర్‌ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రీది ప్రదర్శన ఫ్యాన్స్​కు ఆశ్చర్యానికి గురి చేసింది. అతడి బౌలింగ్ వేగానికి బ్యాట్​ రెండు ముక్కలైంది.

ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పెషావర్‌ జట్టుకు తొలి బంతికే షాహీన్‌ అఫ్రిది షాక్‌ ఇచ్చాడు. అతడు మెరుపు వేగంతా సంధించిన బంతిని డ్రైవ్‌ చేసే క్రమంలో మహ్మద్‌ హరీస్‌ బ్యాట్‌ రెండు ముక్కలైంది. అనంతరం మరో బ్యాట్‌తో అతడు బరిలోకి దిగగా.. షాహీన్‌ వేసిన రెండో బంతికే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. షాహీన్‌ సంధించిన వేగానికి ఆఫ్‌‌ స్టంప్‌ గాల్లోకి పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లాహోర్‌ ఖలందర్స్.. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు. ​ ఫకర్‌ జమాన్‌ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్‌ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్‌ బిల్లింగ్స్‌ (23 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధానాధన్​ ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పెషావర్‌ జల్మీ జట్టుపై ఖలందర్స్‌ బౌలర్లు విరుచుకు పడినప్పటికీ... ఏమాత్రం తగ్గలేదు. బౌండరీలు, సిక్సర్లలో స్డేడియంను హోరెత్తించారు. అయితే సైమ్‌ అయూబ్‌ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్‌ కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్‌), రోవమన్‌ పావెల్‌ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌), జేమ్స్‌ నీషమ్‌ (8 బంతుల్లో 12; సిక్స్‌), సాద్‌ మసూద్‌ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) రాణించినప్పటికీ ఫలితం దక్కలేదు. 40 పరుగుల తేడాతో ఓడిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేశారు. ఖలందర్స్ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది(4-0-40-5), జమాన్‌ ఖాన్‌ (3-0-28-2), హరీస్‌ రౌఫ్‌ (4-0-38-1) రాణించారు.

ఇదీ చూడండి: ఐసీసీ మోస్ట్​ వాల్యుబుల్​ టీమ్​ ఇదే.. భారత్​ నుంచి ఆ ఒక్క ప్లేయర్​కే ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.