Pakistani Actress Comments On Team India : 2023 ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టీమఇండియా సత్తా చాటుతోంది. లీగ్ మ్యాచుల్లో వరుస విజయాలతో దూసుకెళ్లి.. సెమీస్‌కు చేరుకున్న రోహిత్ సేన.. అదే దూకుడుతో సెమీస్ ఆడి ఇప్పుడు తుది పోరులోకి అడుగుపెట్టనుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో టీమ్ఇండియా వెళ్లడం పట్ల క్రికెట్ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత జట్టును కొనియాడుతున్నారు. మాజీలు సైతం మన ప్లేయర్లను అభినందనలు తెలుపుతూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే పాకిస్థాన్‌కు చెందిన నటి సెహర్ షిన్వారీ మాత్రం ఎప్పటిలాగే టీమ్ఇండియాను దుయ్యబట్టింది. బీసీసీఐతో పాటు టీమ్ఇండియాపై సంచలన కామెంట్స్ చేసింది. ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టి అసూయను కనబరిచింది.
"టీమ్ఇండియా ప్లేయర్లు మంచి నటులు. ఈ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ అయ్యిందని వారికి కూడా తెలుసు. కానీ నిజంగానే మ్యాచ్ ఆడుతున్నట్లు భలే నటించారు. ఇలా భారత జట్టు మరోసారి ప్రపంచ కప్ ఫైనల్స్‌కు వెళ్లడాన్ని నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నాను. భారత్ అన్నింటిలో మన దేశం కంటే ఎందుకు ముందు ఉందో అసలు అర్థం కావడం లేదు " అంటూ టీమ్ఇండియా పై వేర్వేరు ట్వీట్లలో తన కోపాన్ని బయటపెట్టింది.
-
Indian team players are good actors. They know this match is fixed but still pretending as if they are really playing this match 😂
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Indian team players are good actors. They know this match is fixed but still pretending as if they are really playing this match 😂
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023Indian team players are good actors. They know this match is fixed but still pretending as if they are really playing this match 😂
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023
-
I just can't digest the fact Indian team has reached world cup final again. Why this bloody country is ahead of us in everything 😭
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">I just can't digest the fact Indian team has reached world cup final again. Why this bloody country is ahead of us in everything 😭
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023I just can't digest the fact Indian team has reached world cup final again. Why this bloody country is ahead of us in everything 😭
— Sehar Shinwari (@SeharShinwari) November 15, 2023
ఇక ఈ పోస్టులు చూసిన క్రికెట్ అభిమానులు ఆ పాక్ నటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట ఆమెపై విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. కామెంట్ల రూపంలో ఆమెను తిట్టిపోస్తున్నారు. అయితే షిన్వారీ భారత జట్టుపై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదేం తొలి సారి కాదు. ప్రపంచకప్ ప్రారంభం నుంచే వివిధ సందర్భాల్లో టీమ్ఇండియాపై అక్కసు చూపిస్తున్న ఈ నటి.. భారత్‌పై విజయం సాధిస్తే బంగ్లా ఆటగాళ్లతో డేటింగ్‌కు వెళ్తానంటూ అప్పట్లో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది.
-
InshAllah my Bangali Bandu will avenge us in the next match. I will go to dhaka and have a fish dinner date with Bangali boy if their team managed to beat India ✌️❤️ 🇧🇩
— Sehar Shinwari (@SeharShinwari) October 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">InshAllah my Bangali Bandu will avenge us in the next match. I will go to dhaka and have a fish dinner date with Bangali boy if their team managed to beat India ✌️❤️ 🇧🇩
— Sehar Shinwari (@SeharShinwari) October 15, 2023InshAllah my Bangali Bandu will avenge us in the next match. I will go to dhaka and have a fish dinner date with Bangali boy if their team managed to beat India ✌️❤️ 🇧🇩
— Sehar Shinwari (@SeharShinwari) October 15, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 2023 వరల్డ్‌కప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 398 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ జట్టు.. 48.5 ఓవర్లలో 327 పరుగులు చేసి చేతులెత్తేసింది. డారిల్ మిచెల్ (138 పరుగులు), కేన్ విలియమ్సన్ (69), గ్లెన్ ఫిలిప్స్ (41) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమి 7, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. 7 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించిన మహ్మద్ షమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ మెగాటోర్నీ హిస్టరీలో నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది.
ఐశ్వర్య రాయ్‌పై పాక్ మాజీ క్రికెటర్ అనుచిత వ్యాఖ్యలు- నెటిజెన్స్ ఫైర్!