ETV Bharat / sports

పీఎస్ఎ​ల్​ మ్యాచ్​లపై ఏపీలో బెట్టింగ్.. నలుగురి అరెస్ట్​ - పీఎస్ఎ​ల్​ మ్యాచ్​లపై ఏపీలో బెట్టింగ్.. నలుగురి అరెస్ట్​

దుబాయ్ వేదికగా జరుగుతోన్న పాకిస్థాన్ సూపర్ లీగ్​ మ్యాచ్​లపై ఆంధ్రప్రదేశ్​లో బెట్టింగ్​లకు పాల్పడుతున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్​ చేసిన పోలీసులు కమ్యానికేషన్​కు ఉపయోగించే పరికరాలను సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు దొరకాల్సి ఉంది.

quetta gladiators, psl
క్వెట్టా గ్లాడియేటర్స్, పీఎస్ఎల్
author img

By

Published : Jun 14, 2021, 5:03 PM IST

ఆంధ్రప్రదేశ్​లో క్రికెట్​ బెట్టింగ్​లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను విశాఖ పోలీసులు అరెస్ట్​ చేశారు. దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆరో ఎడిషన్​ పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ మ్యాచ్​లపై సదరు వ్యక్తులు బెట్టింగ్​లు కడుతున్నట్లు స్పష్టం చేశారు. కమ్యూనికేషన్​కు ఉపయోగించే పరికరాలను సీజ్​ చేసినట్లు తెలిపారు.

అరెస్టయిన వారిలో కె. రవి కుమార్(అక్కయ్యపాలెం), టి. ధనుంజయ(సుజాత నగర్), ఎం. శివాజీ(శ్రీకాకుళం), వి. రాంబాబు(ఎంవీపీ కాలనీ)గా గుర్తించారు పోలీసులు. సీహెచ్​. శ్రీనివాస్​ అలియాస్ కేబుల్ శ్రీనును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడి ఆచూకీ లభ్యం కాలేదు. బెట్టింగ్ నిర్వహించడానికి నలుగురు వ్యక్తులను అతడు నియమించుకున్నట్లు తెలుస్తోంది.

సెటప్ బాక్స్​తో పాటు 29 మొబైల్ ఫోన్లు, హెడ్ సెట్స్, సిమ్​ కార్డులు, రెండు టీవీలు, రెండు ల్యాప్​టాప్​లు, ట్యాబ్, 5 ఖాతా బుక్​లు, రౌటర్​​, కనెక్టర్​, రూ.1590 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్​ సూపర్ లీగ్​లోని క్వెట్టా గ్లాడియేటర్స్​, పెషావర్ జల్మీ జట్ల మధ్య జూన్​ 12న జరిగిన మ్యాచ్ సందర్భంగా.. నిందుతులు ఈ బెట్టింగ్​లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: WTC Final: 'కివీస్​ను ఢీ కొట్టగల సత్తా భారత్ సొంతం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.