ETV Bharat / sports

'ధోనీ, రాహుల్​ ఈ ఒక్క మ్యాచ్​ వదిలేయండి.. ప్లీజ్' - భారత్ పాకిస్థాన్ మ్యాచ్

మరికొద్ది గంటల్లో టీమ్ఇండియా, పాకిస్థాన్ హై వోల్టేజీ మ్యాచ్(Ind vs Pak t20) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ పాకిస్థానీ లేడీ అభిమాని వీడియో తెగ వైరల్​ అవుతోంది. శనివారం ప్రాక్టీస్​ అనంతరం.. కేఎల్​ రాహుల్, మెంటార్​ ధోనీలను(Dhoni Mentor).. 'ఈ ఒక్క మ్యాచ్​ వదిలేయండి' అంటూ అభిమాని కోరింది. దీనిపై ధోనీ ఏమన్నాడంటే..

dhoni, kl rahul
ధోనీ, కేఎల్ రాహుల్
author img

By

Published : Oct 24, 2021, 6:17 PM IST

అభిమానుల ఫేవరెట్.. టీమ్ఇండియా, పాకిస్థాన్​ పోరు(IND vs PAK t20) మరికొద్దగంటల్లో ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్​ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. శనివారం ఓ పాకిస్థానీ క్రికెట్ అభిమాని​ టీమ్​ఇండియా మెంటార్​ ధోనీ(Dhoni Mentor), బ్యాట్స్​మన్ కేఎల్​ రాహుల్​తో చేసిన సంభాషణ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రాక్టీస్​ ముగించుకుని ఆటగాళ్లంతా డ్రెస్సింగ్​ రూమ్​కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

'రాహుల్​.. ఈ ఒక్క మ్యాచ్​లో బాగా ఆడకు. ప్లీజ్.. ఈ ఒక్క మ్యాచ్​ వదిలేయ్' అని కేఎల్​ రాహుల్​తో మాట్లాడింది ఓ అభిమాని. అనంతరం.. మహీనీ ఇదేవిధంగా బతిమిలాడింది. 'ఈ మ్యాచ్​ వద్దు.. తర్వాతి మ్యాచ్​లోనే చూసుకోండి ప్లీజ్' అని అడిగింది. దీనికి సమాధానం ఇచ్చిన ధోనీ.. 'మా పనే ఇది' అంటూ సరదాగా స్పందించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్​ అవుతోంది.

ప్రతీసారి గెలస్తుందని లేదు..

హై వోల్టేజీ మ్యాచ్​ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడాడు. 'ఈ మ్యాచ్​ గెలవడం చాలా ముఖ్యం కానీ, ప్రతీసారి పాకిస్థాన్​పై భారత్​ గెలుస్తుందని భావించలేం' అని గంగూలీ అన్నాడు.

ఇదీ చదవండి:

T20 world cup 2021: కెప్టెన్స్​ కోహ్లీ-బాబర్​ రికార్డ్స్​ ఇవే​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.