ETV Bharat / sports

పాకిస్థాన్​కు తప్పని వీసా తిప్పలు- డాక్టర్​, టీమ్​ మేనేజర్​ లేకుండా విదేశాల్లో జట్లు! - పాకిస్థాన్ టీమ్ డాక్టర్ వీసా సమస్య​

Pakistan Cricket Team In Australia : ఇటీవలి కాలంలో పాకిస్థాన్ జట్టును వరుస సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో లగేజీ విషయంలో కాంట్రవర్సీ జరగ్గా, ఇప్పుడు వీసాల కారణంగా ఆ జట్టు చిక్కుల్లో పడింది. ఇంతకీ ఏం జరగిందంటే ?

Pakistan Cricket  Team
Pakistan Cricket Team
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 12:49 PM IST

Updated : Dec 10, 2023, 3:05 PM IST

Pakistan Cricket Team In Australia : వీసా, పాస్​పోర్ట్ సమస్యల కారణంగా పాకిస్థాన్ జట్టు చిక్కుల్లో పడింది. దీంతో సీనియర్​ జట్టుతో ప్రయాణించాల్సిన టీమ్​ డాక్టర్​ ఆస్ట్రేలియాకు రాలేకపోయారు. మరోవైపు యూఏఈలో ఉన్న అండర్​ 19 జట్టుకు ఇదే సమస్య తలెత్తడం వల్ల ఆ జట్టు మేనేజర్ లేకుండానే పయనమవ్వాల్సి వచ్చింది. అయితే ఈ విషయంపై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు తాజాగా స్పందించిందని సమాచారం.

పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు ఇప్పటికే డాక్టర్ సలీమ్‌కు వీసా కోసం ప్రయత్నిస్తోందని, అది వచ్చిన వెంటనే ఆయన పెర్త్‌లో జరిగే మొదటి టెస్ట్ కల్లా ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని అని పీసీబీకి చెందిన అధికారులు పేర్కొన్నారు. ఇక అండర్​ 19 జట్టు మేనేజర్​ విషయంలోనూ ఇదే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమచారం. ఆయన పాస్​పోర్ట్​ విషయంలో కొన్న ఇబ్బందులు ఉన్నాయని వాటిని త్వరలోనే సరి చేయనున్నారని తెలిపారు. అయితే పాకిస్థాన్ జట్టుకు చెందిన ఆఫ్​ స్పిన్నర్​ అర్బార్​ అహ్మద్​ కూడా వీసా సమస్యల కారణంగా ఆస్ట్రేలియాకు ఆలస్యంగా చేరుకున్నాడు.

వరల్డ్ కప్ టైమ్​లోనూ..
World Cup 2023 Pakistan Team : అయితే గతంలోనూ పాకిస్థాన్​ జట్టుకు ఇదే సమస్య తలెత్తింది. భారత్ వేదికగా జరిగిన వరల్డ్​ కప్​ కోసం పాకిస్థాన్ ఇక్కడికి రావాల్సి వచ్చింది. అయితే షెడ్యూల్​ ప్రకారం ఆ జట్టు సెప్టెంబర్​ 27న హైదరాబద్​కు చేరుకుని ఆ తర్వాత సెప్టెంబర్ 29న హైదరాబాద్​ వేదికగా న్యూజిలాండ్​తో ​వార్మప్​ మ్యాచ్​ ఆడాలి. కానీ పాక్​ టీమ్​కు భారత వీసాలు మంజూరు కాకపోవడం వల్ల దుబాయ్​లో జరగాల్సిన బాండింగ్ సెషన్​ రద్దు అయింది. దీంతో ఐసీసీ సీఈఓ జియోఫ్​ అల్లార్డిస్​కు పీసీబీ ఓ లేఖ రాసింది.

అందులో తమ జట్టు ప్లేయర్లకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, అభిమానులకు వీసా మంజూరు విషయంలో తాము వ్యక్తం చేసిన ఆందోళలను మూడేళ్లుగా పరిష్కరించలేదని తెలిపింది. పాకిస్థాన్​తో ఇలాంటి అవమానకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని చెప్పింది. ఆ తర్వాత పాక్ ప్లేయర్ల సమస్య పరిష్కారమై వాళ్లు భారత్ గడ్డపై అడుగుపెట్టారు.

'అందుకోసమే మేము లగేజ్ మోయాల్సి వచ్చింది' - షహీన్ అఫ్రిదీ క్లారిటీ

Pakistan Team Kolkata Biryani : హోటల్‍లో డిన్నర్​కు పాక్​ టీమ్​ నో.. 'జామ్​ జామ్​'లో బిర్యానీ ఆర్డర్!

Last Updated : Dec 10, 2023, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.