Haider Ali Runout Video : క్రీడల్లో అప్పుడప్పుడు ఎన్నో చిత్ర విచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. విటాలిటీ బ్లాస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో పాకిస్థానీ ఆటగాడు హైదర్ అలీ విచిత్రంగా స్టంపౌట్ అవ్వడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ వీడియోను చూసిన అభిమానులు నవ్వుకుంటూ.. సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
వార్విక్‌షైర్ స్పిన్నర్ డాన్నీ బ్రిగ్స్ 11వ ఓవర్‌లో వేసిన ఫుల్ లెన్త్ బాల్‌కు హైదర్ అలీ.. స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన బౌలర్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని వేసాడు. దాంతో హైదర్ అలీ బ్యాట్‌ను మిస్సై బంతి వికెట్ కీపర్ చేతిలో పడింది. ఈ బంతిని అందుకునే క్రమంలో వికెట్ కీపర్ కాస్త తడబడగా.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు హైదర్ అలీ ట్రై చేశాడు. ముందుగా స్టంపౌట్‌ను తప్పించుకునేందుకు బ్యాట్‌ను క్రీజులో పెట్టిన హైదర్.. ఆ తర్వాత కీపర్ బంతిని వికెట్లకు కొట్టేసాడని అనుకుని పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని చేతులోనే ఉంచుకున్న వికెట్ కీపర్ స్టంపౌట్ చేశాడు. దాంతో హైదర్ అలీ ఒక్కసారిగా షాకయ్యాడు.
-
Make sense of this Haider Ali stumping 👀 #Blast23 pic.twitter.com/d1iD6t1yMZ
— Vitality Blast (@VitalityBlast) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Make sense of this Haider Ali stumping 👀 #Blast23 pic.twitter.com/d1iD6t1yMZ
— Vitality Blast (@VitalityBlast) June 7, 2023Make sense of this Haider Ali stumping 👀 #Blast23 pic.twitter.com/d1iD6t1yMZ
— Vitality Blast (@VitalityBlast) June 7, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విటాలిటీ బ్లాస్ట్గా పేరొందిన ఈ టీ20 టోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం డెర్బీషైర్ ఫాల్కన్స్ - వార్విక్‌షైర్ జట్లు పోటీపడ్డాయి. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో హైదర్ అలీ ప్రాతినిథ్యం వహించిన డెర్బీషైర్ జట్టు.. వార్విక్‌షైర్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వార్విక్‌షైర్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఇక అలెక్స్ డేవిస్, సామ్ హైన్, డాన్ మౌస్లీ ఈ మ్యాచ్‌లో రాణించారు. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన డెర్బీ షైర్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 207 పరుగులు చేసి విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. ఇక ఈ జట్టులోని లూయిస్ రీస్, లూస్ డూ పోలీ, అర్ధశతకాలతో రాణించగా.. హైదర్ అలీ కూడా తనవంతు పరుగులను ఇచ్చాడు.