Pak vs Netherlands : 2023-ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది పాకిస్థాన్. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ (68) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 287 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లకే 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెదర్లాండ్స్ ఓపెనర్లలో విక్రమ్ జిత్ సింగ్ 52, బాస్ డీ లీడే 67 పరుగులతో పర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు క్రీజ్ ముందు నిలవలేక పోయారు. ఓ దశలో నెదర్లాండ్స్ విజయం దిశగా అడుగులు వేసింది. కానీ, 26 ఓవర్ల నుంచి 10 ఓవర్ల వ్యవధిలో కీలకమైన 4 వికెట్లు పడిపోయాయి. దీంతో 41 ఓవర్లకే 205 పరుగుల వద్ద ఆలౌటైంది. చివర్లో లోగన్ వాన్ బీక్ (28*, 28 బంతుల్లో 3×4, 1×6) మెరుపు దాడి చేసినా ఫలితం లేకపోయింది. పాక్ బౌలర్లలో హరిస్ రవూఫ్ మూడు వికెట్లు, హసన్ అలీ రెండు, ఇఫ్లికర్ అహ్మద్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 49 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు ఫఖర్ జమాన్ 12, ఇమాం ఉల్ హక్ 15 పరుగులకు ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజం ఐదు పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మహ్మద్ రిజ్వాన్ 68, షౌద్ షకీల్ 68 పరుగులతో జట్టుకు గట్టి పునాది వేశారు. అనంతరం వచ్చిన మహ్మద్ నవాజ్ 39, షాదాబ్ ఖాన్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డే లీడే నాలుగు వికెట్లు, కలిన్ అకర్ మాన్ రెండు వికెట్లు, ఆర్యన్ దట్, లోగాన్ బెర్క్, పాల్ వాన్ మీకెరెన్ చెరో వికెట్ పడగొట్టారు.
Gill Dengue Fever : గిల్‌కు డెంగీ.. ఓపెనర్‌గా కిషన్!.. ప్రస్తుతం భారత్ జట్టు ఎలా ఉందంటే?
Sri Lanka World Cup 2023 : అనుభవం తక్కువ ప్రదర్శన ఎక్కువ.. ఈ లంక ప్లేయర్ల ఆట అదుర్స్!