Pak Vs Ban Asia Cup 2023 : ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన సూపర్-4 తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మొదట హారిస్ రవూఫ్‌తో పాటు నసీమ్ షా విజృంభించినప్పటికీ బంగ్లా 38.4 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. ముష్ఫికర్ రహీమ్, షకిబ్ అల్‌హసన్ తప్ప బంగ్లా బ్యాటర్లు ఎవరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేదు. దీంతో ఆ జట్టు ఓటమి దాదాపు ఖరారైంది.
మరోవైపు బంగ్లా నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్.. 39.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇమాముల్ హక్ ఛేదనలో పాక్‌కు బలమైన పునాది పడగా.. రిజ్వాన్ కూడా తనదైన శైలిలో ఆడి జట్టును విజయపథంలోకి నడిపించాడు. ఇక శనివారం జరగనున్న తర్వాతి సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకను బంగ్లా ఢీకొట్టనుంది.
-
Asia Cup 2023: Bangladesh 🆚 Pakistan | Super Four (D/N) 🏏
— Bangladesh Cricket (@BCBtigers) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Snaps from Bangladesh's Bowling 🇧🇩#BCB | #AsiaCup | #BANvPAK pic.twitter.com/9SNBGO3OvY
">Asia Cup 2023: Bangladesh 🆚 Pakistan | Super Four (D/N) 🏏
— Bangladesh Cricket (@BCBtigers) September 6, 2023
Snaps from Bangladesh's Bowling 🇧🇩#BCB | #AsiaCup | #BANvPAK pic.twitter.com/9SNBGO3OvYAsia Cup 2023: Bangladesh 🆚 Pakistan | Super Four (D/N) 🏏
— Bangladesh Cricket (@BCBtigers) September 6, 2023
Snaps from Bangladesh's Bowling 🇧🇩#BCB | #AsiaCup | #BANvPAK pic.twitter.com/9SNBGO3OvY
Pakistan Vs Bangladesh : మొదట నుంచి బంగ్లా ఇన్నింగ్స్ కాస్త నాటకీయంగానే సాగింది. ఆ జట్టుకు దక్కిన ఆరంభం చూస్తే 150 అయినా చేస్తుందా..? లేదా అని అనిపించింది. అయితే మధ్యలో వేగం పుంజుకున్న ఆ జట్టు 250 దాటేలాగే కనిపించింది. కానీ చివరికి 193 పరుగులకే ఔటైంది. హారిస్ రవూఫ్‌తో పాటు నసీమ్ షా, షహీన్ అఫ్రిది (1/42) సైతం కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల బంగ్లా ఒక దశలో 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే గత మ్యాచ్ సెంచరీ హీరో మిరాజ్ డకౌటై వెనుదిరగా.. నయీమ్ (20), లిటన్ (16) మంచి ఆరంభాలను వృథా చేసుకున్నారు.
హృదాయ్ (2) కూడా ఎక్కువసేపు నిలవకపోవడం వల్ల బంగ్లాకు ఇబ్బందులు తప్పలేదు. పతనం దిశగా సాగుతున్న ఆ జట్టును కెప్టెన్ షకిబ్.. ముష్ఫికర్‌తో కలిసి ఆదుకున్నాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకోవడమే కాక.. శతక భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో బంగ్లా 147/4తో మంచి స్థితికి చేరుకుంది. కానీ భారీ షాట్ ఆడబోయి షకిబ్ వెనుదిరగడం వల్ల మ్యాచ్‌లో ఓ చిన్న ట్విస్ట్ ఎదురైంది. అక్కడ నుంచి క్రమ క్రమంగా వికెట్లు డౌన్ అవ్వడం ఆగలేదు. రవూఫ్.. ఒకే ఓవర్లో ముష్ఫికర్, తస్కిన్లను ఔట్ చేశాడు. నసీమ్ కూడా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడం వల్ల బంగ్లా పనైపోయింది.
మరోవైపు ఛేదనలో పాక్ కూడా తడబడింది. జమాన్ (20), బాబర్ (17)ల వికెట్లు త్వరగా కోల్పోయింది. కానీ ఇమాముల్, రిజ్వాన్ మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించడం వల్ల జట్టు విజయానికి చేరువలో నిలిచింది. అయితే పాక్ 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ఇమామ్ ఔటైనప్పటికీ.. సల్మాన్ (12 నాటౌట్)తో కలిసి రిజ్వాన్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
-
Rizwan and Imam's excellent half-centuries help Pakistan register a thumping win in the first Super 4 match 🙌#PAKvBAN | #AsiaCup2023 pic.twitter.com/ELzTjTk21v
— Pakistan Cricket (@TheRealPCB) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rizwan and Imam's excellent half-centuries help Pakistan register a thumping win in the first Super 4 match 🙌#PAKvBAN | #AsiaCup2023 pic.twitter.com/ELzTjTk21v
— Pakistan Cricket (@TheRealPCB) September 6, 2023Rizwan and Imam's excellent half-centuries help Pakistan register a thumping win in the first Super 4 match 🙌#PAKvBAN | #AsiaCup2023 pic.twitter.com/ELzTjTk21v
— Pakistan Cricket (@TheRealPCB) September 6, 2023
Asia Cup 2023 : సూపర్-4లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..
India Pakistan Series : 'భారత్-పాక్ సిరీస్ కోసం PCB డిమాండ్.. అంతా సర్కార్ చేతుల్లోనే!'