ETV Bharat / sports

అందుకే బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరం: దాదా

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్​ బిన్నీ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా మరింత కాలం కొనసాగేందుకు గంగూలీ ఆసక్తి చూపించారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై దాదా స్పందించారు. ఏమన్నారంటే..

author img

By

Published : Oct 13, 2022, 4:42 PM IST

Updated : Oct 13, 2022, 5:18 PM IST

sourav ganguly bcci
sourav ganguly

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీ కాలం పూర్తవ్వడం వల్ల.. కొత్త అధ్యక్షునిగా టీమ్​ఇండియా 1983 ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ రోజర్‌ బిన్నీ​ రోజర్​ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 18న ముంబయిలో జరిగే బోర్డు ఏజీఎమ్​లో బిన్నీ అధికారికంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే దాదా ప్రెసిడెంట్​ పదవిని వదులుకోవడానికి సుముఖంగా లేనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదా దీనిపై స్పందించారు. అధ్యక్షుడిగా పదవిని తాను ఆస్వాదించినట్లు తెలిపారు.

"బంగా క్రికెట్​ అసోషియేషన్​కు దాదాపు 5 ఏళ్లు ప్రెసిడెంట్​గా వ్యవహరించాను. బీసీసీఐ అధ్యక్షుడిగా మూడేళ్ల నుంచి కొనసాగుతున్నాను. ఓ సారీ పదవీ కాలం పూర్తయిపోతే ఇక అంతే.. దాన్ని విడిచిపెట్టాల్సిందే. మనం నిరంతరం ఒకే పనిని చేస్తూ ఉండలేము కదా. ఓ ప్లేయర్​గా ఓ అధ్యక్షునిగా నాణేనికి ఉన్న రెండువైపులను చూశాను." అని గంగూలీ పేర్కొన్నారు.

కాగా, బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా మాత్రం అదే పదవిలో కొనసాగనున్నాడు. అయితే అతడు ఐసీసీ బోర్డ్‌లో భారత ప్రతినిధిగా గంగూలీ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆశిష్​ శేలార్​ ట్రెజరర్​గా ఎంపిక కానున్నాడట. ఇక రాజీవ్​ శుక్లా వైస్​ ప్రెసిడెంట్​గా తన పదవిని కొనసాగించనున్నాడు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ సింగ్ ధుమాల్ ఐపీఎల్​ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ఇక అక్టోబర్‌ 18వ తేదీన ముంబయిలో బీసీసీఐకి ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 11-12 తేదీల్లో జరుగుతుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 14వ తేదీ వరకు తుది గడువు.

ఇదీ చదవండి: వార్మప్​ మ్యాచ్​.. టీమ్​ఇండియాకు నిరాశ.. ఆస్ట్రేలియాపై ఓటమి

'సూపర్‌ మ్యాన్‌'లా స్టోక్స్‌.. కళ్లు చెదిరే విన్యాసానికి నెటిజన్లు ఫిదా!

Last Updated : Oct 13, 2022, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.