ETV Bharat / sports

లంక బౌలర్లపై ఊచకోత- ఆ రికార్డుకు 22 ఏళ్లు - శ్రీలంక

శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన 1999 ప్రపంచకప్ మ్యాచ్​ గుర్తుందా? టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్లు సౌరభ్ గంగూలీ-రాహుల్ ద్రవిడ్ జోడీ.. ఫోర్లు, సిక్స్​లతో విధ్వంసం సృష్టించింది. రెండో వికెట్​కు ఏకంగా 318 పరుగులు జోడించింది. ఆ భారీ భాగస్వామ్యానికి నేటికి సరిగా 22 ఏళ్లవుతుంది.

Ganguly, Dravid
సౌరభ్ గంగూలీ,రాహుల్ ద్రవిడ్
author img

By

Published : May 26, 2021, 4:53 PM IST

అదే పనిగా బౌండరీలు బాదేస్తుంటే.. ప్రతి ఓవర్లో సిక్సర్లు కొట్టేస్తుంటే.. ఎదుర్కొన్న ప్రతి బౌలర్‌ను ఉతికి ఆరేస్తుంటే.. మీకు ఏమనిపిస్తుంది? ఇదేదో ఐపీఎల్‌ మ్యాచులో సన్నివేశంగా అనిపిస్తుంది. కానీ టీ20 క్రికెట్‌ రాకముందే.. ఐపీఎల్‌ అంటే తెలియని రోజుల్లోనే సౌరభ్ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ ఆ మజా అందించారు. 1999 మే 26న విధ్వంసం ఇలా ఉంటుందని ప్రత్యక్షంగా చూపించారు.

టాంటన్‌ వేదికగా జరిగిన మ్యాచ్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన శ్రీలంకతో.. టీమ్‌ఇండియా తలపడింది. టాస్‌ గెలవగానే లంక సారథి అర్జున రణతుంగ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే చమింద వాస్‌తో వికెట్లు తీయించే ప్రణాళిక వేశాడు. అందుకు తగ్గట్టే మొదటి ఓవర్లోనే దాదా ఓపెనింగ్‌ భాగస్వామి శఠగోపన్‌ రమేశ్‌ను వాస్‌ పెవిలియన్‌ పంపించాడు. కానీ అప్పుడే మొదలైంది అసలు ఆట. సౌరభ్ గంగూలీ (183; 158 బంతుల్లో 17×4, 7×6), రాహుల్‌ ద్రవిడ్‌ (145; 120 బంతుల్లో 17×4, 1×6) లంక బౌలింగ్‌ను చిత్తుగా కొట్టేశారు. 44.5 ఓవర్లలో 318 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డేల్లో ఇంత భారీ భాగస్వామ్యం సాధించడం అదే తొలిసారి. వారిద్దరి ధాటికి ప్రపంచకప్‌లో భారత్​.. అత్యుత్తమ స్కోరును(373) సాధించింది.

ఇదీ చదవండి: వైరల్​.. కేఎల్‌ యాక్షన్‌-అతియా రియాక్షన్‌

ద్రవిడ్‌ తన సహజ శైలికి భిన్నంగా ఆడాడు. వరుసగా బౌండరీలు బాదేశాడు. అవన్నీ మైదానాన్ని ముద్దాడుతూ బౌండరీ సరిహద్దులు దాటేశాయి. బంతికో పరుగు చొప్పున మిస్టర్‌ డిపెండబుల్‌ ఆ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ అందుకున్నాడు. మరోవైపు గంగూలీ వీర విహారం చేశాడు. 119 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత ముత్తయ్య మురళీధరన్‌, సనత్‌ జయసూర్యకు చుక్కలు చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే మరో 83 పరుగులు చేసేశాడు. వికెట్‌పై తన బ్యాటుతో నాట్యం చేశాడు. భారత్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని లంక ఛేదించలేకపోయింది. 216కే కుప్పకూలింది. దీంతో టీమ్‌ఇండియా 157 పరుగుల తేడాతో విజయం అందుకుంది.

ఇదీ చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్: రెండో స్థానానికి బంగ్లా బౌలర్ హసన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.