National Cricket Day: సచిన్ తెందూల్కర్.. భారత క్రికెట్ చరిత్రలో చెరగని అధ్యాయం లిఖించిన వ్యక్తి. ఎన్నో రికార్డులు నెలకొల్పి, మరెన్నో రికార్డులను తిరగరాసిన దిగ్గజం. ఆటపై అంతగా ప్రభావం చూపాడు కాబట్టే అతడిని అభిమానులంతా 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా పిలుచుకుంటూ ఉంటారు. ఆ బ్యాటింగ్ దిగ్గజం పుట్టిన రోజు నేడు(ఏప్రిల్ 24). ఈ సందర్భంగా అతడికి అన్ని వైపుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు. సచిన్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూనే.. ఈ ప్రత్యేకమైన రోజును 'జాతీయ క్రికెట్ దినోత్సవం'గా జరుపుకుంటే బాగుంటుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నాడు. ఏప్రిల్ 24వ తేదీని సచిన్ పేరిట చిరస్మరణీయంగా ఉండిపోయేలా చేయాలని పిలుపునిచ్చాడు.
Sachin Tendulkar birthday: 'ఏప్రిల్ 24ను జాతీయ క్రికెట్ దినోత్సవంగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది? క్రికెట్ పట్ల ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. క్రికెట్‌పై భారత్‌లో అమర ప్రేమకు కారణమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు' ట్వీట్ చేశాడు కైఫ్. ఈ ప్రతిపాదనకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. చాలా మంది నెటిజన్లు కైఫ్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. సచిన్ రాకతో భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
కాగా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఆదివారం.. 49వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు సాధించిన మాస్టర్ బ్లాస్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా టీమ్ ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, ప్రజ్ఞాన్ ఓజా, ఇషాన్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ తదితరులు బర్త్‌డే విషెస్ చెప్పారు. మరోవైపు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సచిన్‌కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపాడు. ఈ పూర్తి కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: 2వేల కడక్‌నాథ్ కోడిపిల్లల్ని కొన్న ధోనీ.. అన్ని ఎందుకంటే?