Ollie Robinson Ashes : ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్బస్టన్ మైదానం వేదికగా జూన్ 16న ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో మరో వింత సన్నివేశం కనిపించింది. అదేంటంటే.. ఇంగ్లాండ్ జట్టులో మధ్య ఓవర్లలో బౌలింగ్ వేసేందుకు వచ్చిన ప్రధాన పేసర్ ఒల్లీ రాబిన్సన్ కాలికి డిఫరెంట్ షూస్‌తో కనిపించాడు. కుడి కాలికి ఓ బ్రాండ్ షూ, ఎడమ కాలికి ఇంకో బ్రాండ్ షూ వేసుకుని మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది గమనించిన నెటిజన్లు.. 'నీ యాటిట్యూడ్ తర్వాత ముందు షూస్ సరిగ్గా వేసుకో గురూ..' అంటూ జోక్స్ వేసుకుంటూ పాయింట్ ఔట్ చేస్తున్నారు. ఇంకొంతమంది 'తప్పేముంది.. బహుశా రెండు షూ కంపెనీలకు ప్రచారం చేస్తున్నాడేమో.. అందుకే ప్రమోషన్ కోసం ఇలా చేశాడేమో' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలా ఆసక్తిగా సాగిపోతున్న మ్యాచ్‌లో రాబిన్ చేసిన ఈ పనికి స్టేడియంలో ఉన్నవారందరూ కూడా కాసేపు నవ్వుకున్నారు.
కాలి గాయమేమో..!
Robinson County Injury : అయితే ఇలా రాబిన్సన్ కాలికో షూస్ ధరించడం వెనుక ఓ బలమైన కారణం ఉందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే యాషెస్ సిరీస్‌లోకి రాకముందు రాబిన్సన్ కౌంటీ క్రికెట్లో ఆడాడు. ఈ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాబిన్సన్ కాలికి గాయమైంది. దీంతో కొద్దిరోజులు ఎడమ కాలి మడమ దగ్గర నొప్పితో బాధపడ్డాడు. క్రమంగా ఆ గాయం నుంచి కోలుకొని యాషెస్ సిరీస్‌లోకి దిగాడు. ఈ క్రమంలో అతనికి ఇంకా నొప్పి తగ్గకపోవడంతో ఇలా రెండు రకాల షూస్ వేసుకొని వచ్చాడని కొందరు అంటున్నారు.
కోపంగా సెండాఫ్..!
Robinson Send Off Khawaja : ఇదిలా ఉంటే ఈ టెస్ట్ సిరీస్‌లోనే మరో అంశం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అదే ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజాకు ఒల్లీ రాబిన్సన్ వినూత్న రీతిలో సెండాఫ్ ఇవ్వటం. ఈ మ్యాచ్‌లో శతకం బాది మంచి ఊపు మీదున్న ఖావాజాను క్లీన్ బౌల్డ్ చేశాడు రాబిన్. ఈ క్రమంలో ఖావాజా పెవిలియన్‌కు తిరిగి వెళ్తున్న క్రమంలో రాబిన్ అతడివైపు కోపంతో చూస్తూ పెద్దగా అరిచాడు. దీంతో రాబిన్ కాస్త హద్దులు మీరి ప్రవర్తించాడంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇది మరవకముందే రాబిన్ సన్ ఇలా కాలికో షూ వేసుకురావడంతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు.
Ashes Series 2023 : ఇక మ్యాచ్ విషయానికొస్తే 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సరికి 107/3 స్కోర్‌తో నిలిచింది. ఇక ఈ సిరీస్‌లో విజయం సాధించడానికి ఇంగ్లాండ్‌కు ఏడు వికెట్లు అవసరం ఏర్పడగా.. ఆసీస్ జట్టు మరో 174 పరుగులు చేయాల్సి ఉంది.