ODI World Cup 2023 Lalchand Rajput : భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ 2023లో టీమ్ఇండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని టీమ్ ఇండియా మాజీ ప్లేయర్, క్రికెట్ మేనేజర్ లాల్ చంద్ రాజ్‌పుత్ ధీమా వ్యక్తం చేశారు. యంగ్ ప్లేయర్ గిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కప్ మనదే.. ఎనిమిదో స్థానంలో అతడైతే ఒకే.. 'ముగ్గురు పేసర్లతో టీమ్ ఇండియా బరిలోకి దిగితే.. వారిలో షమి, సిరాజ్, బుమ్రా ఉంటే బాగుంటుంది. అయితే ఎనిమిదో స్థానం కోసం టీమ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ కూడా చేయగలిగే బౌలర్ ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే హార్దిక్ పాండ్య, జడేజా లాంటి వారు ఏడో స్థానంలో ఉన్నారు. అదే కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగితే.. అప్పుడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో స్థానంలో ఆడొచ్చు. ఆసియా కప్ ఫైనల్ టీమ్ఇండియా అద్భుతంగా ఆడిన విధానం చూస్తుంటే కచ్చితంగా వచ్చే వరల్డ్ కప్‌లో గెలుస్తుందని అనిపిస్తుంది. జట్టు మంచి వరల్డకప్ కోసం మంచి ఆకలి మీద ఉన్నట్లు అర్థమవుతోంది.' అని లాల్ చంద్ అన్నారు.
గిల్‌పై భారీగా.. 'జట్టులో కొంతమంది ఆటగాళ్లపై మంచి అంచనాలు ఉన్నాయని అన్నారు లాల్ చంద్ రాజ్‌పుత్. గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆసియా కప్‌లో అద్భుత సెంచరీలు బాదారు. కెప్టెన్ రోహిత్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయ్యర్ కూడా మంచి రాణించాడు. కానీ వీరందరిలోకల్లా నాకు గిల్‌పైనే భారీ అంచనాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు.
జడేజాపై ఆందోళన లేదు.. 'వన్డేల్లో జడేజా ఫామ్ గురించి నాకు ఎటువంటి ఆందోళన లేదు. అతడు మ్యాచ్ విన్నర్. బౌలింగ్ ఆల్ రౌండర్. బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. గన్ ఫీల్డర్ కూడా. ఈ మధ్య కాలంలో అతడు బ్యాట్‌తో సరిగ్గా రాణించలేకపోవచ్చు. కానీ అతడు కచ్చితంగా ఫామ్‌లోకి వచ్చేస్తాడు' అని అన్నారు.
ఇలా ఆడితేనే గెలుపు.. 'నాక్ ఔట్ గేమ్స్‌లో వీలైనంత అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. అలా అని సెమీఫైనల్, ఫైనల్ గేమ్ అనే రేంజ్లో ఒత్తిడి తీసుకునేలా కాదు. కేవలం ఆడే మ్యాచ్‌పై మాత్రమే బాగా ఫోకస్ చేయాలి. లేదంటే ఒత్తిడి పడితే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది' అని లాల్ చెప్పారు.
-
#NewProfilePic pic.twitter.com/maW0208NeV
— Lalchand Rajput (@Lalchandrajput7) October 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#NewProfilePic pic.twitter.com/maW0208NeV
— Lalchand Rajput (@Lalchandrajput7) October 25, 2022#NewProfilePic pic.twitter.com/maW0208NeV
— Lalchand Rajput (@Lalchandrajput7) October 25, 2022
ODI World Cup 2023 : 'టీమ్ఇండియాకు ఆ సత్తా ఉంది.. అతడు అద్భుతం చేస్తాడు'