న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test)లో సెంచరీతో రాణించాడు టీమ్ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer Century). ఇది కెరీర్లో అతడి మొదటి టెస్టు అయినా.. ఏమాత్రం తడబడకుండా పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట ముగిసిన అనంతరం మాట్లాడిన శ్రేయస్.. పలు విషయాలు వెల్లడించాడు. ఇప్పుడు తన గురువును డిన్నర్‌కు ఆహ్వానిస్తానంటూ వెల్లడించాడు.
"ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు మా గురువు ప్రవీణ్ ఆమ్రే(shreyas iyer about pravin amre) సర్‌ను ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానిస్తా. నేను ఎప్పుడు ఆయన వద్దకు ట్రైనింగ్ కోసం వెళ్లినా.. 'నువ్వు నీ జీవితంలో చాలా సాధించావు. ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా చేశావు. చాలా పరుగులు సాధించావు. కానీ అదంతా పరిమిత ఓవర్ల క్రికెట్లో. నీ ప్రధాన లక్ష్యం ఏంటంటే టీమ్ఇండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడటం. అలా నువ్వు టెస్టు సెంచరీ సాధించినపుడే నేను నీతో డిన్నర్ చేస్తా' అనేవారు. ఈ మ్యాచ్‌లో నేను సెంచరీ చేశా. ఇక ప్రవీణ్ సర్‌ను డిన్నర్ కోసం ఆహ్వానిస్తా."
-శ్రేయస్ అయ్యర్, టీమ్ఇండియా క్రికెటర్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది భారత జట్టు. శ్రేయస్ (105) సెంచరీతో రాణించగా.. గిల్ (52), జడేజా (50) అర్ధసెంచరీలతో మెరిశారు. కివీస్ బౌలర్లలో సౌథీ 5, జేమిసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు లాథమ్ (50*), విల్ యంగ్ (75*) శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని అర్ధసెంచరీలు సాధించారు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి ఒక్క వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది కివీస్. ఇంకా 216 పరుగుల వెనకంజలో ఉంది.