కోచ్‌గా జట్టులోని ప్రతి క్రికెటర్‌తో చర్చించడం అవసరమని అన్నారు టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్. ఆట పరంగా వారి మనస్తత్వాలు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే అలా చర్చించిన తర్వాత ఆటగాడిని బట్టి శిక్షణ ఉంటుందన్నారు. ఇంగ్లాండ్‌తో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనున్న నేపథ్యంలో జట్టు గురించి విక్రమ్ రాఠోడ్ ఈ విధంగా మాట్లాడాడు.
"జట్టులో బృందచర్చలు ఎప్పుడూ జరుగుతుంటాయి. జట్టు దృక్పథాన్ని మెరుగుపరుస్తాయి. అందుకు భిన్నంగా నేను ఒక్కొక్కరితోనూ ప్రత్యేకంగా మాట్లాడతాను. ఉదాహరణకు పుజారా, పంత్ భిన్నమైన మనస్తత్వాలు, పని విలువలు కలిగిన వారు. వారు చెప్పేది జాగ్రత్తగా వింటేనే వారి గురించి బాగా అర్థమవుతుంది. వారు ఎలాంటి పరిష్కారాలు కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఎక్కువ ప్రతిభ, వైవిధ్యం గలవారితో విడివిడిగా మాట్లాడటం అవసరం."
- విక్రమ్ రాఠోడ్, టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్
"పుజారాకు అంకితభావం ఎక్కువ. పట్టుదలగా, క్రమశిక్షణతో ఉంటాడు. క్రికెట్లోనే కాదు అతడి జీవనశైలీ ఇలాగే ఉంటుంది. ఒకే తరహా పద్ధతులు ఉంటాయి. ఇక పంత్ నిర్భయంగా సరదాగా ఉంటాడు. తన శైలిలో ఆడేందుకు ఇష్టపడతాడు. మరి ఏ జట్టులోనూ 11 మంది పుజారాలు, 11 మంది పంత్‌లు ఉండరు కదా. పంత్, పుజారా గెలుపు కూర్పులో ఉండాల్సిందే. అందుకే వారిని వారి శైలిలోనే ఉండనివ్వడం ముఖ్యం. నా వరకు పుజారా అదనంగా తన అమ్ముల పొదిలో కొత్త షాట్లు సంపాదించుకోవడం, పంత్ అవసరమైతే ఎక్కువ బంతులు డిఫెండ్ చేయగలిగేలా చేయడమే ముఖ్యం" అని రాఠోడ్ తెలిపారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత పరిణతి కలిగిన ఆటగాడని విక్రమ్ ప్రశంసించారు. 2016లో ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు, భారీ సిక్సర్లు బాదిన అతడే వెస్టిండీస్‌లో గాల్లోకి కొట్టకుండానే ద్విశతకం చేశాడని గుర్తు చేశారు. టెస్టుల్లోనూ రాణిస్తున రోహిత్‌శర్మ తన ఆలోచనలు, బ్యాటింగ్‌పై నియంత్రణ సాధించాడని పేర్కొన్నారు. అజింక్య రహానె గొప్ప ఆటగాడని జట్టు విజయం కోసమే కృషి చేస్తాడని వెల్లడించారు.
ఇదీ చూడండి: అత్యుత్తమ టెస్టు సారథులు.. వారి రికార్డులు!