ETV Bharat / sports

Ind Vs Nz: 'మీరు నాలుగే.. కోహ్లీ ఏకంగా 15 సార్లు' - టాస్​ ఓడిపోవడంపై నీషమ్​ ట్వీట్​

india new zealand toss: భారత పర్యటనలో తమ జట్టు వరుసగా నాలుగో సారి టాస్​ ఓడిపోవడంపై న్యూజిలాండ్​ ప్లేయర్​ నీషమ్​ తమాషాగా ట్వీట్​ చేశాడు. వైరల్​గా మారిన ఈ ట్వీట్​కు నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

india new zealand toss, neesham toss tweets, టాస్​ ఓడిన న్యూజిలాండ్​
టీమ్​ఇండియా న్యూజిలాండ్​ సిరీస్​
author img

By

Published : Nov 25, 2021, 6:40 PM IST

neesham toss tweets: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ప్రారంభమైన తొలి మ్యాచ్‌ మొదటి రోజు ఆట ముగిసింది. అయితే ఈ మ్యాచ్​లో భాగంగా టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత పర్యటనలో వరుసగా నాలుగోసారి కివీస్‌ టాస్‌ ఓడిపోవడం గమనార్హం. మూడు టీ20ల సిరీస్‌లోనూ ఒక్కసారి కూడా టాస్‌ నెగ్గలేదు(india new zealand toss). దీంతో తమ జట్టు టాస్‌ ఓడిపోవడంపై కివీస్‌ ఆటగాడు జిమ్మీ నీషమ్‌ ట్విటర్‌ వేదికగా తమాషాగా స్పందించాడు.

ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే నీషమ్‌ తనదైన హాస్యచతురతతో ట్వీట్లు పెడుతుంటాడు. ఈ క్రమంలోనే టాస్‌ ఓడిపోవడంపై "దయ చేసి ఎవరైనా టాస్‌ వేసే కాయిన్లను దగ్గరగా పరీక్షించండి" అంటూ సరదాగా ఓ ట్వీట్‌ వేసేశాడు. దీనికి నెటిజన్ల నుంచి కామెంట్ల వర్ష కురిసింది. 'ఏమో ఫిక్సింగ్ జరిగిందేమోనని' ఒకరు స్పందించగా.. 'ఏం ఫర్వాలేదు.. వచ్చే మ్యాచ్‌కు విరాట్‌ వచ్చేస్తాడు. మీరు తప్పకుండా టాస్‌ గెలుస్తారు.. కంగారు పడకండి'... 'విరాట్ కూడా వరుసగా పదిసార్లు టాస్‌ ఓడిపోయాడు.. అయినా మీలాగా ట్విటర్‌లో బాధపడలేదు' అంటూ నెటిజన్ల చమక్కులు విసిరారు.

విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్, బుమ్రా, షమీ వంటి సీనియర్లు లేకుండా అజింక్యా రహానె సారథ్యంలో టీమ్‌ఇండియా బరిలోకి దిగింది(teamindia vs newzealand match). మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. టెస్టు అరంగేట్రం చేసిన శ్రేయస్​ అయ్యర్​(75*) అద్భుతంగా ఆడి అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఇదీ చూడండి: శ్రేయస్​.. హాస్పిటల్​​ బెడ్​ నుంచి టెస్టు​ అరంగేట్రం వరకు​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.