ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. మంగళవారం నుంచి అవుట్డోర్ ట్రైనింగ్ ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు అక్కడ వర్షాలు కురవడం వల్ల సోమవారం వరకు ఇండోర్ ట్రైనింగ్ చేశారు. తాజాగా దానికి సంబంధించిన అనుభవాన్ని ఆటగాళ్లు తెలిపారు.
"సౌథాంప్టన్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ వాతవరణం తడిగా ఉంది. అందువల్ల నాలుగైదు రోజుల నుంచి ఇండోర్ ట్రైనింగ్ చేస్తున్నాం. మొత్తం జట్టంతా అవుట్డోర్ ట్రైనింగ్ చేయాలని ఆశిస్తున్నారు. మొత్తంగా ఇక్కడికి వచ్చి ఆడే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది."
-విల్ యంగ్, బ్యాట్స్‌మన్
-
Outside! First net session on grass in Southampton. #ENGvNZ pic.twitter.com/uzp2129JAB
— BLACKCAPS (@BLACKCAPS) May 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Outside! First net session on grass in Southampton. #ENGvNZ pic.twitter.com/uzp2129JAB
— BLACKCAPS (@BLACKCAPS) May 25, 2021Outside! First net session on grass in Southampton. #ENGvNZ pic.twitter.com/uzp2129JAB
— BLACKCAPS (@BLACKCAPS) May 25, 2021
"ఇంత పెద్ద జట్టు ఉన్నప్పుడు.. అందరి అంచనాలకు తగ్గట్లుగా ఏర్పాట్లుచేయడం ఇండోర్ ట్రైనింగ్‌లో కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ అందుబాటులో ఉన్న వాటితో శిక్షణ చేయడం మన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది."-స్టెడ్, న్యూజిలాండ్ క్రికెటర్
-
Will Young with the update from the team’s first net session on grass since arriving in Southampton. #ENGvNZ #WTC21 pic.twitter.com/GKz8KnbdMH
— BLACKCAPS (@BLACKCAPS) May 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Will Young with the update from the team’s first net session on grass since arriving in Southampton. #ENGvNZ #WTC21 pic.twitter.com/GKz8KnbdMH
— BLACKCAPS (@BLACKCAPS) May 25, 2021Will Young with the update from the team’s first net session on grass since arriving in Southampton. #ENGvNZ #WTC21 pic.twitter.com/GKz8KnbdMH
— BLACKCAPS (@BLACKCAPS) May 25, 2021
"ఇంగ్లాండ్‌కు వచ్చినప్పుడు బయటకు వెళ్లి ఇక్కడి భిన్నమైన పరిస్థితులను ఆస్వాదించాలని సాధారణంగా ఎవరైనా అనుకుంటారు. కానీ అలా ప్రస్తుతం కుదరట్లేదు. ఏదేమైనప్పటికీ మేము ముందుగానే న్యూజిలాండ్‌లో బాగా ప్రాక్టీస్ చేశాం. పచ్చిక ఉన్న వికెట్లపైనా శిక్షణ పొందాం. రెండు క్యాంపులను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పోలిస్తే ట్రైనింగ్‌లో మేము ఏమాత్రం వెనుకబడలేదని అనుకుంటున్నా.
-గ్యారీ, హెడ్ కోచ్.
ఇంగ్లాండ్ పర్యటనలో న్యూజిలాండ్ జూన్ 2-10వరకు ప్రత్యర్థి జట్టుతో రెండు టెస్టుల్లో తలపడనుంది. ఆ తర్వాత అక్కడే ఉండి జూన్ 18 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ఇండియాతో ఆడనుంది.