ఐపీఎల్లో ఆడుతున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు టీమ్ఇండియాతో పాటే ఇంగ్లాండ్‌కు బయల్దేరతారని కివీస్ క్రికెటర్ల సంఘం సీఈఓ హీత్ మిల్స్ తెలిపాడు. 15 రోజుల కఠిన క్వారంటైన్ నిబంధన నేపథ్యంలో కివీస్ ఆటగాళ్లు సొంతగడ్డకు వచ్చి. అక్కడ్నుంచి ఇంగ్లాండ్‌కు వెళ్లడం సాధ్యంకాదని చెప్పారు. జూన్ 18న సౌథాంప్టన్‌లో టీమ్ండియా, కివీస్‌ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభంకానుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమీసన్, మిచెల్ శాంట్నర్‌తో సహా 10 మంది కివీస్ ఆటగాళ్లు ప్రస్తుత ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జూన్ 2న ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 20 మంది ఆటగాళ్లతో జట్టును న్యూజిలాండ్ ప్రకటించింది. వారిలో నుంచి 15 మందిని డబ్యూటిసీ ఫైనల్‌కు ఎంపిక చేయనుంది.
"ఆటగాళ్లు సొంతగడ్డకు రావడం.. రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉండటం.. అనంతరం ఇంగ్లాండ్‌కు వెళ్లడం అంత సులువు కాదు. కాబట్టి ఐపీఎల్ లీగ్ దశ లేదా ఫైనల్ ముగిసే వరకు కివీస్ ఆటగాళ్లంతా భారత్‌లోనే ఉంటారు. లీగ్ తర్వాత కొందరు స్వదేశానికి రాను న్నారు. ప్రస్తుతం ఎక్కువ విమానాలు లేవు. ప్రయాణ ఏర్పాట్లు అంత సులభం కాదు. భారత్‌లో ప్రస్తుత పరిస్థితులపై కివీస్ ఆటగాళ్లకు పూర్తి అవగాహన ఉంది. వారేమీ అందోళన చెందట్లేదు. స్వదేశానికి రావాలనుకుంటున్నట్లు ఇప్పటి వరకు ఎవరూ సుంకేతాలు ఇవ్వలేదు. భారత్‌లో అత్యంత సురక్షిత ప్రదేశంలో ఆటగాళ్ల ఉన్నారు" అని మిర్చి తెలిపాడు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న స్కాట్ కుగెలిన్, జిమ్మీ నీషమ్, అడమ్ మిల్నీ, ఫిన్ అలెన్, ఫెర్గూసన్, టిమ్ సీఫెర్ట్‌లు కివీస్ డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో లేదు.