ఇంగ్లాండ్ పర్యటనలో(India Tour of England 2021) టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (Rohit Sharma England Series) తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని క్రికెట్ పండితులు విశ్లేషించారు. అయితే అందుకు తాను అంగీకరించనని అంటున్నాడు రోహిత్ శర్మ(Rohit Sharma News). పలువురు విశ్లేషణపై స్పందించిన హిట్‌మ్యాన్.. తనలోని అత్యుత్తమ ప్రదర్శన ఇంకా బయట పడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
"టెస్టు కెరీర్లో ప్రస్తుతం నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. కానీ ఇంగ్లాండ్ పర్యటనే నా అత్యుత్తమ సిరీస్ కాదు. నాలోని అత్యుత్తమ ప్రదర్శన ఇంకా బయటకు రావాల్సి ఉంది. సౌతాంప్టన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌నకు ముందు ఉన్న సమయాన్ని ఎలాంటి టెక్నిక్, దృక్పథంతో ఉండాలి అనే అంశాల కోసం వినియోగించా. ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా."
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా క్రికెటర్
ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో 52.57 సగటుతో 368 పరుగులు(Rohit Sharma England Tour Runs) చేశాడు రోహిత్. టీమ్ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసింది అతడే. ఈ సిరీస్‌లో భాగంగానే విదేశీ గడ్డపై తన తొలి టెస్టు సెంచరీ(Rohit Sharma England Century) కూడా నమోదు చేశాడు హిట్‌మ్యాన్.
ఇండియానే గెలిచింది..
కరోనా కారణంగా భారత్, ఇంగ్లాండ్(IND Vs ENG) మధ్య ఇటీవల రద్దయిన అయిదో టెస్టు భవితవ్యంపై తనకు అవగాహన లేదని రోహిత్ అన్నాడు. అయితే తన దృష్టిలో ఇప్పటికే సిరీస్‌ను 2-1తో టీమ్ఇండియా కైవసం చేసుకుందని చెప్పాడు.
వచ్చే ఏడాదే రద్దయిన టెస్టు..
ఇంగ్లాండ్‌తో రద్దయిన ఐదో టెస్టును(Manchester Test) వచ్చే ఏడాది ఆగస్టులో నిర్వహించడానికి ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. ఆ సమయంలో భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అప్పుడే అదనంగా ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుకు భారత్ అంగీకరించింది. అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ఈ నెల 10-14 తేదీల్లో జరగాల్సి ఉండగా.. భారత శిబిరంలో కరోనా కేసులు నమోదైన క్రమంలో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడం వల్ల మ్యాచ్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడం వల్ల సిరీస్ ఫలితం కూడా తేలాల్సి ఉంది. ఇక ఓవల్ వేదికగా నాలుగో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌కు పాజిటివ్‌గా తేలారు.
ఇవీ చూడండి:
ఆ బాధ్యతకు రోహిత్ సమర్థుడు: ఛాపెల్