ETV Bharat / sports

ICC: 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' విజేతలు వీరే - ప్లేయర్​ ఆఫ్ ది మంత్ ఆవార్డు

మే నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్ ది మంత్'(Player of The Month)​​ అవార్డు విజేతలుగా బంగ్లా వికెట్​ కీపర్​ ముష్ఫికర్​ రహీమ్​తో పాటు మహిళల విభాగంలో స్కాట్లాండ్ ప్లేయర్​ కేథరిన్ బ్రైస్​ నిలిచారు. లంకపై వన్డే సిరీస్​ గెలవడంలో రహీమ్​ కీలక పాత్ర పోషించాడు.

Mushfiqur Rahim, Kathryn Bryce
ముష్ఫికర్​ రహీమ్, కాథరిన్ బ్రైస్
author img

By

Published : Jun 14, 2021, 3:14 PM IST

మే నెలకుగానూ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'(Player of The Month)​ అవార్డు విజేతలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC). పురుషుల విభాగంలో బంగ్లాదేశ్​ మాజీ కెప్టెన్​ ముష్ఫికర్​ రహీమ్(Mushfiqur Rahim)​, మహిళల విభాగంలో స్కాట్లాండ్ ఆల్​రౌండర్​ కేథరిన్​ బ్రైస్(Kathryn Bryce).. ఈ అవార్డులను గెలుచుకున్నారు.

శ్రీలంకతో జరిగిన ఒక టెస్టుతో పాటు 3 వన్డేల సిరీస్​లో ముష్ఫికర్​ రాణించాడు. లంకపై తొలి వన్డే సిరీస్​ గెలవడానికి తన వంతు పాత్ర పోషించాడు. రెండో వన్డేలో 125 పరుగులు చేశాడు.

ఇక స్కాట్లాండ్ మహిళ క్రికెటర్​ కేథరిన్​ బ్రైస్​.. ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్​లో టాప్​-10లో నిలిచింది. స్కాట్లాండ్​ తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్​ కేథరినే కావడం విశేషం. ఐర్లాండ్​తో జరిగిన టీ20 సిరీస్​లో 96 పరుగులతో పాటు 5 వికెట్లు తీసింది.

ఇదీ చదవండి: WTC Final: ముగిసిన టీమ్​ఇండియా ప్రాక్టీస్​ మ్యాచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.