Mumbai Indians Hardik Pandya : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకు అత్యధిక సార్లు టైటిళ్లు గెలిచిన జట్టుగా కొనసాగుతోంది. అలాంటి జట్టుకు కెప్టెన్ అవకాశం రావటం అంటే గొప్ప అవకాశనమనే చెప్పాలి. ఇప్పుడు ఆ అవకాశం హార్దిక్ పాండ్యకు వచ్చింది. 2024 ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్దిక్‌ను నియమించారు. అయితే ఇలాంటి విజయవంతమైన జట్టుకు సారథ్యం వహించటం అంటే పెద్ద సవాలే అని చెప్పాలి. మరి ఈ 2024 ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌ను ఏవిధంగా నడిపిస్తాడో లేడో చూడాలి.
హార్దిక్ ఐపీఎల్ కేరీర్ అక్కడే మొదలు
హార్దిక్ పాండ్యా 2015లో ముంబయి ఇండియన్స్‌తోనే ఐపీఎల్ కెరీర్ మొదలైంది. భారీ షాట్లతో హార్డ్ హిట్టర్‌గా, మంచి పేస్ బౌలింగ్‌తో వికెట్లు కూలుస్తూ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ ఎదిగాడు. తరవాత జాతీయ జట్టులోకి వచ్చాడు. 2021 వరకు ముంబయితోనే హార్దిక్ ఆడాడు. కానీ వెన్నెముకకు శస్త్ర చికిత్స వల్ల లీగ్‌లో అంతగా రాణించలేకపోయాడు. తరవాత 2022లో హార్దిక్‌ను గుజరాత్ టైటాన్స్ తీసుకోవడమే కాకుండా కెప్టెన్‌నూ చేసింది. హార్దిక్ కెప్టన్‌గా, ఆల్‌రౌండర్‌గా తొలి సీజన్లో అదరగొట్టాడు.
యువ ఆటగాళ్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టును నడింపచడాన్ని సవాలుగా తీసుకుని మరి మంచి నాయకత్వ నైపుణ్యాలతో మెప్పించాడు. యువ ఆటగాళ్లతో కలిసిపోయి జట్టును నడిపించాడు. తొలి సీజన్లోనే గుజరాత్‌ను గెలిపించాడు. ఈ విజయంతో హార్దిక్ పేరు మార్మోగింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో టీమ్‌ఇండియా సారథ్య బాధ్యతలు దక్కాయి. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగించి గుజరాత్‌ను రన్నరప్‌గా నిలిపాడు. దీంతో హార్దిక్‌ను ముంబయి తిరిగి దక్కించుకుంది. వద్దనుకున్న జట్టే తిరిగి అతని కోసం వచ్చేలా హార్దిక్ చేశాడంటే అతని ప్రతిభ ఏమిటో తెలుస్తోంది.
హార్దిక్‌కు ఇది పెద్ద సవాలే!
గుజరాత్ అంటే కొత్త జట్టు పైగా యువ ఆటగాళ్లతో ఎలాంటి ఒత్తిడి అనేది లేకుండా స్వేచ్ఛగా హార్దిక్ జట్టును నడిపించాడు. కానీ ముంబయి ఇండియన్స్ జట్టులో అలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. ఎందుకంటే జట్టులో రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్లు ఉన్నారు. వీళ్లందరూ హార్దిక్ కంటే సీనియర్లే. వీళ్లను సమన్వయం చేసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్లడం హార్దిక్‌కు కత్తిమీద సాములాంటిదే. మరోవైపు గత కొన్ని సీజన్లుగా ముంబయి ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 2021, 2022లో ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. ఈ ఏడాది రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ చేతిలోనే ఓడింది. కాబట్టి ముందుగా జట్టు ప్రదర్శన మెరుగుపడేలా, మరో టైటిల్ సాధించేలా చేసే అతిపెద్ద బాధ్యత హార్దిక్‌పై ఉంది. అంతే కాకుండా సారథ్యంలో రోహిత్‌ను స్థానాన్ని మరిపించాల్సి ఉంటుంది.
2013 మధ్యలో నుంచి 2023 వరకు 11 ఐపీఎల్ సీజన్ల పాటు ముంబయిని రోహిత్ నడిపించాడు. ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు. ముంబయి గెలిచిన ట్రోఫీలన్నీ రోహిత్ కెప్టెన్సీలో వచ్చినవే. అందుకే రోహిత్ వారసత్వాన్ని నిలబెట్టడం హార్దిక్‌పై ముందున్న అతిపెద్ద సవాల్. మరోవైపు టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్ నిలబడాలంటే కూడా.. ముంబయికి కెప్టెన్‌గా అతని ప్రదర్శన కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మరి ఈ సవాళ్లను దాటి ఈ కఠిన పరీక్షలో హార్దిక్ ఎలా నెగ్గుకువస్తాడో చూడాలి.
రోహిత్‌కు గుడ్‌బై!- టీ20 కెప్టెన్‌గా పాండ్య?- అసలేం జరుగుతుందబ్బా?
MI పై రోహిత్ ఎఫెక్ట్!- గంటలో 4లక్షల మంది అన్‌ఫాలో- సూర్య హార్ట్ బ్రేక్ స్టోరీ